బిజినెస్AC Prices Increase In India 2026: ఎండాకాలం రాబోతుంది.. ఇక ఏసీలు కొనే పరిస్థితి...

AC Prices Increase In India 2026: ఎండాకాలం రాబోతుంది.. ఇక ఏసీలు కొనే పరిస్థితి లేదా?

AC Prices Increase In India 2026: భారత దేశంలో వేసవి కాలం మొదలవుతోంది. ఫిబ్రవరిలోనే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఈసారి ఎండల తీవ్రత అధికంగానే ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తరుణంలో వేసవి మార్కెట్‌ మొదలైంది. ఫ్యాన్లు, కూలర్లు, ఫ్రిజ్‌లు, ఏసీల కొనుగోలు ఊపందుకుంది. అయితే ఈ వేసవిలో ఎయిర్‌ కండిషనర్ల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వోల్టాస్‌ ఎండీ ముకుందన్‌ మేనన్‌ తెలిపారు. మెటల్‌ ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం, కొత్త శక్తి సామర్థ్య నియమాల కారణంగా ధరలు 5 నుంచి 15 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేశారు.

మెటల్‌ ధరల ప్రభావం..
దేశంలో ప్రస్తుతతం రాగి ధర టన్నుకు 13 వేల డాలర్లకు చేరడంతో ఏసీల్లో ముఖ్య భాగాలైన కాయిల్స్, కనెక్టర్ల తయారీ ఖర్చు భారీగా పెరిగింది. ఏసీ బాడీ, ఫ్రేమ్‌లకు వాడే అల్యూమినియం, స్టీల్‌ రేట్లు కూడా 10 నుంచి 20 పెరిగాయి. ఇక దిగుమతి విడిభాగాల ధరలు కూడా పెరిగాయి.

కొత్త నియమాలు ఇలా..
జనవరి 2026 నుంచి అమలయ్యే బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) మార్గదర్శకాలు 3–స్టార్‌ ఏసీల ధరలు 3 నుంచి 4 శాతం, 5–స్టార్‌ మోడళ్ల ధర 8 నుంచి 12 శాతం పెరిగే అవకాశం ఉంది. ఇక ఏ2ఎల్‌ రిఫ్రిజరెంట్‌ గ్యాస్‌ వాడాలని, ఇన్వర్టర్‌ కంప్రెసర్లు అధిక సామర్థ్యంగా ఉండాలనే నిబంధనలు తయారీదారులపై అదనపు భారాన్ని వేస్తున్నాయి. పాత మోడళ్లు మార్కెట్‌కు దూరమవుతున్నాయి.

తయారీదారుల ప్రణాళిక
వోల్టాస్, బ్లూ స్టార్, డైకిన్‌ వంటి కంపెనీలు ధరలు జనవరి–ఫిబ్రవరి నుంచి దశలవారీగా పెంచుతాయి. 1.5 టన్‌ 5–స్టార్‌ ఏసీ ధర రూ.45 వేల నుంచి రూ.52 వేలు, ఒక టన్‌ మోడల్స్‌ ధర రూ.35 వేల నుంచి రూ.40 వేలకు పెరిగే అవకాశం ఉంది. ప్రీమియం ఫీచర్లు (ఏసీ కూలింగ్, 2.5 ఫిల్టర్లు) ధరలు మరింత పెరుగుతాయి.

అమ్మకాలూ పెరిగే ఛాన్స్‌..
ధరలు పెరగినా వేసవి డిమాండ్‌తో 20–25% అమ్మకాల పెరుగతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. గతేడాది 3 కోట్ల ఏసీలు అమ్ముడయ్యాయి, ఇప్పుడు 3.6–4 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 15% వృద్ధి ఉంటుందని అంచనా. ఇన్వర్టర్‌ మోడల్స్‌కు ఎక్కువ ఆదరణ వస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Tata Avinya X: ఈ టాటా కారు డిజైన్ గురించి తెలిస్తే క్యూ కట్టకుండా ఉండరు..

Tata Avinya X: భారత దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తమ ప్రతిష్టాత్మక 'టాటా అవిన్యా ఎక్స్' ఈవీ కారును భారత రోడ్లపై రోడ్ టెస్టింగ్...

Honor X7e Plus 5G: ఈ ఫోన్ ఎక్కువ సేపు చూసినా కళ్లకు అలసట కలగదు.. ఎందుకంటే..

Honor X7e Plus 5G: ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Honor తన ప్రముఖ 'ఎక్స్ సిరీస్'లో భాగంగా 'హానర్ ఎక్స్7 ఈ ప్లస్ 5జీ’ని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది....

Mahindra Vision T: మహీంద్రా మరో సంచలనం.. విజన్.T కి భారత్‌లో పేటెంట్.. ఇది ఎలా ఉండబోతుందంటే..

Mahindra Vision T: SUV కార్లను తీసుకురావడంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కార్లతో అలరించిన ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ విషయంలోనూ తనదే...

Jio: జియో వాడుతూ మనం కంపెనీకి ఎంత నెల ఇస్తున్నామో తెలుసా

Jio: రిలయన్స్‌ లిమిటెడ్‌ దేశంలో అతిపెద్ద ప్రైవేటు వ్యాపార సంస్థ. ఈ సంస్థ అధినేత అనిల్‌ అంబానీ ఆసియాలోనే అతిపెద్ద సంపన్నుడు. రిలయన్స్‌ సంస్థ ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉన్న త్రైమాసిక...

OnePlus : స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి OnePlus ఎగ్జిట్.. మరి భారత్ లో..

OnePlus : ప్రముఖ మొబైల్ సంస్థ వన్ ప్లస్ (OnePlus) మార్కెట్ నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్‌ప్లస్ మాతృ సంస్థ అయిన 'ఒప్పో' (Oppo) తన గ్లోబల్ బిజినెస్‌ను పునర్వ్యవస్థీకరించే ఆలోచనలో...
Exit mobile version