Prashanth Neel Vs Srikanth Odela: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్ల మధ్య పోటీ అనేది సర్వ సాధారణం… ఎందుకంటే ఒకరి సినిమా సక్సెస్ సాధిస్తే ఆ సినిమా ఎంతటి కలెక్షన్స్ ను రాబట్టింది అనే లెక్కలైతే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు… కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న ప్రశాంత నీల్ సైతం ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని కూడా భారీ సక్సెస్ గా మలిచే ఉద్దేశ్యంతోనే ప్రశాంత్ నీల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది చెప్పాలంటే సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ అవ్వాల్సిన అవసరమైతే ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచుతున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి…
ఇక శ్రీకాంత్ ఓదెల సైతం ప్రస్తుతం నానితో ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద ప్రేక్షకులందరికి భారీ అంచనాలైతే ఉన్నాయి. ఆగస్టు 21వ తేదీన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు… ఇక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటిని రేకెత్తిస్తుంది…
ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కి శ్రీకాంత్ ఓదెలకు మధ్య పోటీ ఉందని కొంతమంది భావిస్తున్నారు. వీళ్లిద్దరు కూడా మాస్ సినిమాలను చేస్తూ వచ్చారు. కమర్షియల్ సినిమాలకు మాస్ ఇమేజ్ ని జోడించి ప్రేక్షకుడిని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో వీళ్ళిద్దరు చాలా వరకు సక్సెస్ అయ్యారు. నిజానికి ప్రశాంత్ నీల్ శ్రీకాంత్ ఓదెల కంటే ఒక అడుగు ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి.
ఇప్పటివరకు ఆయన చేసిన మూడు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ని సాధించడంతో ఆయన టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోయాడు. ఇక శ్రీకాంత్ ఓదెల సైతం ప్యారడైజ్ సినిమాతో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటాడని చాలామంది భావిస్తున్నారు. ఒకవేళ శ్రీకాంత్ టాప్ లెవెల్ కి వెళ్తే మాత్రం ప్రశాంత్ నీల్ ను బీట్ చేసే స్థాయికి ఎదుగుతాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…