https://oktelugu.com/

జగన్ పట్టుదల.. టెక్ దిగ్గజం ఏపీకి..

ప్రస్తుతం కరోనా వ్యాపింప చేసిన చైనాపై అమెరికా గుర్రుగా ఉంది. చైనాతో వాణిజ్యయుద్ధం చేస్తోంది. ఆ క్రమంలోనే అమెరికన్ కంపెనీలను చైనా నుంచి వెనక్కి రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే చైనా సేఫ్ కాదని ఈ ప్రపంచ దిగ్గజ సంస్థ భారత్ బాట పడుతోంది. కరోనా వైరస్‌ తర్వాత వచ్చే ఐదేళ్లలో భారతదేశ దేశీయ ఎలక్ట్రానిక్‌ మార్కెట్‌ విలువ 400 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని ప్రధాని నరేంద్రమోడీ అంచనావేశారు. . ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కంపెనీలకు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 13, 2020 / 03:14 PM IST
    Follow us on


    ప్రస్తుతం కరోనా వ్యాపింప చేసిన చైనాపై అమెరికా గుర్రుగా ఉంది. చైనాతో వాణిజ్యయుద్ధం చేస్తోంది. ఆ క్రమంలోనే అమెరికన్ కంపెనీలను చైనా నుంచి వెనక్కి రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే చైనా సేఫ్ కాదని ఈ ప్రపంచ దిగ్గజ సంస్థ భారత్ బాట పడుతోంది. కరోనా వైరస్‌ తర్వాత వచ్చే ఐదేళ్లలో భారతదేశ దేశీయ ఎలక్ట్రానిక్‌ మార్కెట్‌ విలువ 400 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని ప్రధాని నరేంద్రమోడీ అంచనావేశారు. . ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కంపెనీలకు మోడీ సూచించారు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ దిగ్గజ కంపెనీని ఏపీ సర్కార్ చేజిక్కించుకుంది. ప్రైవేట్ పరిశ్రమలు, పెట్టుబడులు జగన్ ఉండగా రావడం లేదన్న టీడీపీ విమర్శలకు చెక్ పడింది. ప్రపంచ టెక్ దిగ్గజమే ఏపీకి వస్తుండడం విశేషంగా మారింది.

    ఇప్పుడు ఆ కాపునేతలు ఏం సమాధానం చెబుతారు..?

    ఏపీ సీఎం జగన్ తన ఏడాది పాలనలో పరిశ్రమలు , పెట్టుబడులపై పెద్దగా దృష్టి పెట్టలేదని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. కానీ ఇప్పుడు వారికి బుద్దివచ్చేలా జగన్ పట్టుబట్టి సాధించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ సరఫరాదారుని ఏపీకి రప్పిస్తున్నారు. అయితే ఇటీవలే రాష్ట్రంలోని కియా ఫ్యాక్టరీ విస్తరించనున్నట్టు ప్రకటించింది . ఇక ఇప్పుడు మరో పారిశ్రామిక దిగ్గజం కూడా ఇదే బాటలో పయనిస్తోంది .ఆంధ్రప్రదేశ్ కు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి .

    ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ తయారీ కంపెనీ అమెరికాకు చెందిన యాపిల్ సంస్థ. సుప్రసిద్ధ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తయారుచేసే ఐఫోన్లకి ప్రపంచవ్యాప్తంగా ఎంత గిరాకీ ఉందో తెలిసిందే. ఇక యాపిల్ ఐఫోన్లను భారత్ లోనే ఉత్పత్తి ప్రారంభించనున్నారు. ఈ ఏడాది నుంచి ఐఫోన్లను భారీ ఎత్తున భారత్ లో ఉత్పత్తి చేయనున్నట్టు యాపిల్ ఫోన్ల తయరీ సంస్థ ‘ఫాక్స్ కాన్’ తెలిపింది. ఈ మేరకు ఫాక్స్ కాన్ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్ టెరీ గోవు ప్రకటించారు. తమ కంపెనీ భారత్ లో విస్తరణ ఆలోచనలో ఉండటంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ రావాల్సిందిగా తనను ఆహ్వానించినట్టు గోవు తెలిపారు. యాపిల్ ఐఫోన్లలో కొన్ని పాత మోడళ్లని కొన్నేళ్లుగా బెంగుళూరులోనే తయారు చేస్తున్నారు. ఇకపై కంపెనీ లేటెస్ట్ మోడళ్లని కూడా భారత్ లోనే ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తారు. భారత్ లో లేటెస్ట్ ఐఫోన్ల ట్రయల్ ప్రొడక్షన్ కి ఫాక్స్ కాన్ సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

    కరోనా కట్టడిలో జగన్ మరో విప్లవాత్మక నిర్ణయం

    తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించినట్టు తెలిపింది. . ఫాక్స్ కాన్ ను మొబైల్ ఫోన్ల రంగంలో మంచి పేరుంది . ఈ సంస్థకు ఇప్పటికే శ్రీ సిటీలో ఓ యూనిట్ ఉంది . ఇప్పుడు ఈ యూనిట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతామని ఫాక్స్‌కాన్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌ ఇండియా ఎండీ , కంట్రీ హెడ్‌ జోష్‌ ఫౌల్గర్‌ ప్రకటించారు .

    ఇదే సమయంలో జోష్‌ ఫౌల్గర్‌ ఏపీ సర్కారు పనితీరును మెచ్చుకున్నారు . శ్రీ సిటీలోని ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడానికి వేగంగా అనుమతులు మంజూరు చేసిందన్నారు . రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలోనూ చురుగ్గా పని చేసిందని కితాబిచ్చారు . కరోనా సమయంలో పారిశ్రామిక రంగం త్వరగా కోలుకునే విధంగా ఏపీ సర్కారు.. సీఎం మంచి చర్యలు తీసుకుందని జోష్ ఫౌల్గర్ మెచ్చుకున్నారు.

    ఇలా టీడీపీ నేతలు ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి.. పెట్టుబడులు రావడం లేదని విమర్శిస్తున్న వేళ.. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ యాపిల్ సరఫరాదారు ఏపీలో పెట్టుబడులకు అంగీకరించడం జగన్ సాధించిన గొప్ప విజయంగా చెప్పవచ్చు.