సైన్స్‌ అండ్‌ టెక్నాలజీAnthropic AI: ఆంథ్రోపిక్‌.. ఏఐలో ఓ సునామీ... దీంతో ఏమవుతుంది? ఏ మార్పులు రాబోతున్నాయి..

Anthropic AI: ఆంథ్రోపిక్‌.. ఏఐలో ఓ సునామీ… దీంతో ఏమవుతుంది? ఏ మార్పులు రాబోతున్నాయి..

Anthropic AI: ఏఐ.. ఇప్పుడు ఏ రంగం చూసినా దీని హవానే. మంచి చెడుతో సంబంధం లేకుండా.. ఫలితాలు ఎలా ఉన్నా.. ఏఐని విచ్చల విడిగా వాడేస్తున్నారు. ఇక ఈ ఏఐలో కొత్త కొత్త ఫీచర్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో అన్నిరంగాలు ఎఫెక్ట్‌ అవుతున్నాయి. సునామీలా దూసుకొస్తున్న ఏఐతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఆంథ్రోపిక్‌ సీఈవో డారియో అమోడెయ్‌ ఏఐని సునామీలా వర్ణించారు, సమాజమే సిద్ధంగా లేదని పేర్కొన్నారు. జెరోధా సహవ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌తో ఇంటర్వ్యూలో భారత ఐటీ, స్టార్టప్‌లు, బయోటెక్, నైపుణ్యాలపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

వేగవంతమైన పురోగతి..
ఐదేళ్ల క్రితం కంప్యూటర్‌తో వ్యాసం రాయించడం అసాధ్యమైనది, ఇప్పుడు మానవ మెదడు స్థాయికి ఏఐ చేరింది. డేటా, కంప్యూటింగ్‌ శక్తి పెరగడంతో సామర్థ్యం ఆకాశానికి తాకుతోంది. ఆర్థిక, భద్రతా ప్రభావాలు కొందరికి నచ్చడం లేదు. అపార్థం కొంటున్నారు. అపోహలు పెంచుతున్నారు. సురక్షిత ఏఐ కోసమే ఓపెన్‌ ఏఐ వదిలేసి ఆంథ్రోపిక్‌ స్థాపించామని డారియో వెల్లడించారు.

భారత్‌తో భాగస్వామ్యం
బహుళజాతి సంస్థలు భారత్‌ను కేవలం మార్కెట్‌గా చూస్తునర్నాయి. ఇప్పుడుఆంథ్రోపిక్‌ కూడా ఇలాగే భారత్‌తో భాగస్వామ్యం కోరుకుంటోంది. ఐటీ, కన్సల్టింగ్‌ కంపెనీలతో కలిసి పనిచేయాలని ఆంథ్రోపిక్‌ భావిస్తోంది. ఏపీఐలతో స్వదేశీ సేవలు బలపడతాయి. ఉద్యోగాలపై ఎలాంటిపభావం ఉండదని డారియో వెల్లడించారు. గత అక్టోబర్‌ నుంచి వాడుక, ఆదాయం రెట్టింపు అయింది.

స్టార్టప్‌లకు సూచనలు..
భారత స్టార్టప్‌లు ఏపీఐలతో సరళ యూఐలు కాకుండా ఫైనాన్స్, బయాలజీలో అనుకరణ సాధ్యం లేని పరిష్కారాలు రూపొందించాలని డారియో తెలిపారు. ప్రతి 2–3 నెలలకు కొత్త మోడల్స్‌ వాడుకుని వినూత్నతకు అవకాశం ఇవ్వాలని సూచించారు. సంక్లిష్ట ఏఐలు మానవ నిర్ణయాలు తీసుకుంటాయని సింథటిక్‌ డేటా ప్రాముఖ్యత పెరుగుతుందని తెలిపారు. దీనిపై నియంత్రణ అవసరమన్నారు. బయాలజిస్టుగా డారియో, ఏఐతో క్యాన్సర్‌కు కీమో థెరపీలు, పెప్టైడ్‌ చికిత్సలు సాధ్యమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కోడింగ్‌లాంటి సాఫ్ట్‌వేర్‌ పనులను ఏఐ ఆక్రమిస్తోంది. మానవ సంబంధాలు, భౌతిక పనులు, సంస్థల మధ్య సంనాదాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఫేక్‌ కంటెంట్‌ను గుర్తించే విమర్శనాత్మక ఆలోచన అవసరమని డారియో అభిప్రాయపడ్డారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ అంతరిక్ష పరిశోధన లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. తక్కువ, మధ్య స్థాయి బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి అద్భుతం సృష్టించింది. ప్రైవేట్ రంగంలో...

Uday Ruddarraju: Chat GPTనే షేక్ చేసిన తెలుగు కుర్రాడు.. ఎంత జీతం పొందాడో తెలుసా..

Uday Ruddarraju: ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్నాలజీ కంపెనీల్లో భారతీయులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే సత్యం నాదెళ్ల, సుందర్ పిచాయ్, శంతన్ నాయాయణ్ వంటి వారు తమ నైపుణ్యంతో కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. అయితే...

India First Hydrogen Train: హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది.. ఇందులో ఎంతమంది వెళ్లొచ్చు..

India First Hydrogen Train: భారతీయ రైల్వే చరిత్రలో పర్యావరణ పరిరక్షణ దిశగా ఒక సరికొత్త విప్లవం మొదలైంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తొలి హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలును (India's...

BrahMos Missile: మన బ్రహ్మోస్ గిరాకీ అట్లున్నది మరీ.. చైనా, అమెరికా కు గట్టి షాక్

BrahMos Missile: దిగుమతుల నుంచి ఎగుమతులు.. ఆంక్షలు నుంచి ఆకాంక్షలు.. బెదిరింపుల నుంచి స్నేహ హస్తాలు.. సాధింపుల నుంచి సాధికారతలు.. ఇలా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ పరిపాలన కాలంలో రక్షణ పరంగా.....

Hands Free Calling: మొబైల్ ను ముట్టుకోకుండా ఫోన్ చేయాలనుకుంటున్నారా.. ఇలా చేస్తే చాలు..

Hands Free Calling: ప్రస్తుత కాలంలో మొబైల్ లో చాలా సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడ కీ ప్యాడ్ ఉన్న ఫోన్ ను ఇప్పుడు స్మార్ట్ గా వాడుతున్నారు. ఇదే సమయంలో...
Exit mobile version