spot_img
Homeఆంధ్రప్రదేశ్‌PRC Issue in AP: ఏపీ మంత్రులకు గట్టి షాక్ ఇచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు

PRC Issue in AP: ఏపీ మంత్రులకు గట్టి షాక్ ఇచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు

PRC Issue in AP:  ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య వివాదం ఇంకా ముదురుతున్నది. ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన పీఆర్సీ ఉత్వర్వులతో ఈ వివాదం తెర మీదకు వచ్చింది. పీఆర్సీ విషయమై ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. సమ్మె బాట పడుతున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఉద్యోగులతో చర్చించేందుకుగాను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. అలా ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు నిర్వహించాలని ఏపీ సర్కారు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానిలకు బాధ్యతలు అప్పజెప్పింది. కాగా, ఉద్యోగ సంఘాల నేతలకు చర్చల సమయంలో మంత్రులకు గట్టి షాక్ ఇచ్చినంత పని చేశారు. ఇంతకీ వారు ఏం చేశారంటే..

PRC Issue in AP
PRC Issue in AP

పీఆర్సీ వివాదం నేపథ్యంలో సోమవారం ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. చర్చల కోసం మంత్రులు సెక్రెటేరియట్‌కు వచ్చారు. ఉదయం 11 గంటలకు వచ్చిన మంత్రులు ఉద్యోగ సంఘాల నేతల కోసం ఎదురు చూశారు. కానీ, నేతలు అయితే రాలేదు.

Also Read: జగన్, మంత్రులకు షాక్.. ఏపీలో మోగిన సమ్మె సైరన్

పీఆర్సీ వివాదంపై చర్చలకు తాము రాలేమని, పీఆర్సీ జీవోలు వెనక్కు తీసుకుంటేనే వస్తామని నేతలు పట్టబడుతున్నారు. ఈ విషయమై ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఉద్యోగ సంఘాల నేతలు తమ షెడ్యూల్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమ్మె నోటీసు ఇవ్వాల్సి ఉంది. కానీ, ఈ లో పే హై కోర్టులో పిటిషన్ దాఖలు కావడం, విచారణ జరగడంతో వేతనాలపై హైకోర్టు వ్యాఖ్యలతో ఈ వ్యవహారంలో మరో కోణం బయటకు వచ్చింది.

AP and Telangana
AP CM YS Jagan

గెజిటెడ్ ఉద్యోగులసంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సమ్మె నోటీసు ఇస్తున్న 12 మంది ఉద్యోగసంఘాల నేతల్ని హైకోర్టు పిలిపించింది. ఈ క్రమంలో సమ్మె గురించి హై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా కీలకంగా మారనుంది. కాగా, హైకోర్టు విచారణతో సంబంధం లేకుండా ఉద్యోగులు సమ్మె నోటీసు ఇస్తారా? లేదా హైకోర్టు వ్యాఖ్యలతో వెనక్కు తగ్గుతారా ? లేదా ? అనే విషయం ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Also Read:అనుష్కను పెళ్లిచేసుకోవడంతోనే విరాట్ కు కష్టాలా?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper