spot_img
Homeజాతీయ వార్తలుమోడీ వ్యతిరేకులతో పీకే మీటింగ్స్. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం

మోడీ వ్యతిరేకులతో పీకే మీటింగ్స్. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం

Prashant Kishorదేశంలో మూడో కూటమి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీయేతర పక్షాలతో జట్టు కట్టేందుకు ప్రశాంత్ కిషోర్ కసరత్తు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ తోపాటు ప్రాంతీయ పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేయగా ఎన్సీపీ అధినేత శరత్ పవార్ సైతం చేరేందుకు సిద్ధమయ్యారు మరో వారం రోజుల్లో కేసీఆర్ తోనూ చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై పడింది.

బీజేపీ వ్యతిరేక కూటమిలోకి జగన్ ను తీసుకు రావడానికి ప్రశాంత్ కిషోర్ ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ జగన్ భారతీయ జనతా పార్టీతో లడాయి పెట్టుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో పీకే పాచిక పారుతుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో జగన్ బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరతారా అనే సందేహాలు వస్తున్నాయి. కానీ ప్రశాంత్ కిషోర్ పై జగన్ కు నమ్మకం ఉంది. దీంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీజేపీని ఎదిరిస్తే భవిష్యత్తులో వచ్చే సమస్యలపై కలవరపడినా జగన్ స్టాండ్ మార్చుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

జగన్ బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన వ్యక్తి కాదు. వాటిలో పుట్టిపెరిగిన వ్యక్తి కాదు. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ రక్తం. బీజేపీతో సంబంధాలు నెరవేరడం లేదు. అదే బీజేపీకి గడ్డు పరిస్థితి ఎదురవుతుందని అనుకున్నప్పుడు ఆయన కూడా లెక్క చేయడం మానేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. బీజేపీకి గడ్డు పరిస్థితి వచ్చిందని జగన్ ను నమ్మించాల్సి ఉంది. మోడీ కన్నా పీకేను జగన్ ఎక్కువగా నమ్మితే మోడీ వ్యతిరేక కూటమికి బలం లభించినట్లేనని చెప్పుకోవచ్చు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper