
హైదరాబాద్ లో రూ. కోటి విలువ చేసే నిషేధిత గుట్కా సీజ్ చేసినట్లు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ పేర్కొన్నారు. గుట్కా పట్టివేత కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుల్లో ఇద్దరు కర్ణాటక వాసులు ఉన్నారు. బేగం బజార్ లో లారీలో భారీగా ఉన్న గుట్కా నిల్వలు గుర్తించాం. గుట్కా విక్రయం ముఠాకు చెందిన కొంతమంది పరారీలో ఉన్నారు. నిందితులను నవ భారత్ రోడ్ లయన్స్ పేరుతో ట్రాన్స్ పోర్టు కార్యాలయం నిర్వహిస్తున్నారని కమిషనర్ తెలిపారు.