NTR- Koratala Siva Movie: ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో ఉంది. రెగ్యులర్ షూట్ కి సమయం దగ్గరపడుతుండగా కొరటాల శివ తీరిక లేకుండా కష్టపడుతున్నాడు .ఇప్పటికే అనుకున్న సమయానికి దాదాపు ఏడాది ఆలస్యమైంది. ఆచార్య విడుదల డిలే కావడంతో పాటు ఎన్టీఆర్ స్క్రిప్ట్ పట్ల సంతృప్తి చెందకపోవడంతో సెట్స్ పైకి వెళ్లాల్సిన మూవీ వెనక్కు వెళ్ళింది. కొరటాల సిద్ధం చేసిన ఫైనల్ స్క్రిప్ట్ ఎన్టీఆర్ కి నచ్చడంతో షూట్ కి పచ్చజెండా ఊపారు. ఇక ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ కోసం బరువు కూడా తగ్గారు. మెంటల్ గా ఫిజికల్ గా కొరటాల మూవీ కోసం ఎన్టీఆర్ సిద్ధం అవుతున్నాడు.

ఇటీవల ఎన్టీఆర్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ తో భేటీ అయ్యారు. ఫస్ట్ షెడ్యూల్ కొరకు ఏర్పాటు చేయాల్సిన సెట్స్, లొకేషన్స్ గురించి చర్చించారు. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ 30 తెరకెక్కించేందుకు కొరటాల శివ ప్రణాళికలు వేస్తున్నారు. ఎన్టీఆర్ 30 ప్రీ లుక్ అంచనాలు పెంచేసింది. కొరటాల అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నట్లు ప్రీ లుక్ చూశాక అర్థం అవుతుంది.
తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతుంది. ఫిల్మ్ ఛాంబర్ లో కొరటాల ‘దేవర’ అనే పవర్ ఫుల్ మాస్ టైటిల్ రిజిస్టర్ చేయించారట. ఆ టైటిల్ ఎన్టీఆర్ చిత్రానికే అని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ ఇమేజ్ కి కరెక్ట్ గా సెట్ అయ్యే దేవర టైటిల్ గూస్ బంప్స్ కలిగిస్తుంది. టైటిల్ విన్నాక ఎన్టీఆర్ కి బ్లాక్ బస్టర్ ఖాయమన్న అభిప్రాయానికి ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు. దేవర టైటిల్ అదిరిపోయింది… అదే ఫిక్స్ చేయండని సోషల్ మీడియాలో అభ్యర్థిస్తున్నారు.

కాగా ఈ టైటిల్ చాలా కాలం క్రితం నిర్మాత బండ్ల గణేష్ రిజిస్టర్ చేయించాడట. పవన్ కళ్యాణ్ ని బండ్ల గణేష్ దేవర అని ప్రేమగా పిలుచుకుంటారు. భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ తో చేయబోయే చిత్రానికి ఈ టైటిల్ పెట్టాలని ఆయన అనుకున్నారట. అయితే దేవర టైటిల్ రెన్యువల్ చేయించడం మర్చిపోవడంతో కొరటాల శివ చేతిలోకి వెళ్ళింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ కోసం బండ్ల గణేష్ అనుకున్న టైటిల్ ఎన్టీఆర్ సినిమాకు ఫిక్స్ చేయబోతున్నారనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రముఖం ప్రచారం అవుతుంది. ఇక ఎన్టీఆర్ 30 చిత్రానికి నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఉన్నాడు.