Homeజాతీయ వార్తలురైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యుస్.. బ్యాంకు ఖాతాల్లో మళ్లీ రూ. 2000..?

రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యుస్.. బ్యాంకు ఖాతాల్లో మళ్లీ రూ. 2000..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ గత ప్రభుత్వాలకు భిన్నంగా రైతుల సంక్షేమానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం రైతులకు చేరువ కావడానికి అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కూడా ఒకటి. రైతులకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఎవరైతే ఈ పథకం కింద చేరతారో వారి ఖాతాల్లో సంవత్సరానికి 6,000 రూపాయలు మూడు విడతల్లో జమ చేస్తోంది.

ఒక్కో విడతలో కేంద్రం రైతులకు 2,000 రూపాయలు చొప్పున ఇస్తోంది. గడిచిన రెండు సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ పథకం అమలు జరుగుతోంది. పలు రాష్ట్రాల్లో రైతులకు సంబంధించి అనేక పథకాలు అమలవుతున్నా ఆ పథకాలతో సంబంధం లేకుండా కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మోదీ సర్కార్ అమలు చేస్తుండటం గమనార్హం. మరికొన్ని రోజుల్లో కేంద్రం మరో విడత నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రెండు విడతల డబ్బు రైతుల ఖాతాలలో జమ కాగా మరో విడత నగదు జమ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో రైతుల ఖాతాలలో మళ్లీ రెండు వేల రూపాయలు జమ కానున్నాయి. గతంలో నగదు జమ అయిన రైతులందరి ఖాతాలలో మరో విడత నగదు జమ కానుంది. అయితే అర్హులైనా నగదు జమ కాని రైతులు మరోమారు దరఖాస్తు చేసి నగదు పొందవచ్చు.

ఇప్పటివరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోని రైతులు ఆన్‌లైన్‌లో పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. https://pmkisan.gov.in/ వెబ్ సైట్ లో సరైన వివరాలను పొందుపరిచి ఈ పథకానికి అర్హత పొందవచ్చు. కేంద్రం రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో మరిన్ని పథకాలను అమలు చేస్తోంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper