Homeజాతీయ వార్తలుDharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలా ఆలోచిస్తారని ఎవరూ పెద్దగా అంచనా వేయలేదు. పైగా ఆయన నీట్ అక్రమాల నేపథ్యంలో వరుసగా సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు. దేశంలో యువతకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. అంతేకాదు నీట్ అక్రమాలకు.. పేపర్ లీకేజీలకు పాల్పడే వారికి […]

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలా ఆలోచిస్తారని ఎవరూ పెద్దగా అంచనా వేయలేదు. పైగా ఆయన నీట్ అక్రమాల నేపథ్యంలో వరుసగా సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు. దేశంలో యువతకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. అంతేకాదు నీట్ అక్రమాలకు.. పేపర్ లీకేజీలకు పాల్పడే వారికి భవిష్యత్తులో తీవ్రమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం లేదని అందరూ ఒక అంచనాకొచ్చారు. అయితే అనూహ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశ రాజకీయాలలో సంచలనంగా మారింది.

సోనం దీక్ష విరమణ.. విద్యార్థుల నిరసన విరమణ.. ప్రధానమంత్రి అర్ధరాత్రి వీడియోలు.. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు.. ఇవన్నీ సానుకూలంగా కనిపిస్తున్నాయి. అయితే ఒక్కసారిగా ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించడంతో పరిస్థితి మారిపోయింది. వాస్తవానికి సోనం నిరాహార దీక్షకు దిగినప్పుడు కేంద్ర పెద్దగా పట్టించుకోలేదు. దీంతో విద్యార్థుల్లో ఆగ్రహం పెరిగిపోయింది. పార్లమెంట్లో సభలు నిర్వహిస్తున్నప్పుడు విద్యార్థులు ఆందోళన చేశారు. దీంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అనివార్యంగా ఈ ఆందోళనలకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఎప్పుడైతే హస్తం పార్టీ రంగంలోకి దిగిందో.. అప్పుడే ఈ ఉద్యమంలో చిన్న చిన్న శక్తుల స్థాయి తగ్గిపోయింది.

ఎప్పుడైతే రాహుల్ గాంధీ వచ్చారు ఈ ఉద్యమానికి రాజకీయ రంగు అంటుకుంది. కేంద్ర కూడా కోరుకున్నది ఇదే.. ఒక ఉద్యమం ప్రజల చేతుల్లో ఉంటే దానికి వక్ర భాష్యం చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ రాజకీయ పార్టీలు ప్రవేశించిన తర్వాత దాని మీద ముద్ర వేయడం సులభం.. గతంలో జాతీయస్థాయిలో జరిగిన ఆందోళనలను కేంద్రం ఈజీగానే పరిష్కరించగలిగింది. విద్యార్థుల్లో అసంతృప్తి వ్యక్తమైనప్పుడు.. దానిని తొక్కి వేయడానికి కేంద్రం ప్రయత్నించలేదు. బల ప్రయోగం చేయాలి అనుకోలేదు. ప్రతిపక్షాలు ప్రవేశించిన తర్వాత.. అందులో రాజకీయ స్వార్థం ఉందని నిరూపించడానికి కేంద్రానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు నీట్ ఆందోళనలో జరిగింది కూడా అదే. ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్ తన భుజాలకు వేసుకోవడంతోనే.. నరేంద్ర మోడీ నేరుగా రంగంలోకి దిగారు.

వాస్తవానికి జరిగిన ఈ ఘటన కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుందని.. నరేంద్ర మోడీ స్థాయిని తగ్గిస్తుందని చాలామంది అంచనా వేస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతాయని భావిస్తున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ఈ టార్గెట్ పూర్తయిన తర్వాత.. నరేంద్ర మోడీ తన గేమ్ ప్లాన్ మొదలు పెడతారు. కేంద్రం ప్రగంలోకి దిగిన తర్వాత నిరసనలను మొత్తాన్ని తొక్కిపడేస్తూ ఉంటుంది. ఇప్పటికైతే స్టూడెంట్స్ కు నిరసనలు నిలిచిపోయినట్టే.. హస్తం పార్టీకి పొలిటికల్ మైలేజ్ తెచ్చుకునే అవకాశం చేజారిపోయినట్టే. కాకపోతే మోడీ ఇప్పుడు రంగంలోకి దిగి.. తన వ్యూహ చతురతను ఏ స్థాయిలో అమలు చేస్తారనేది.. ఇక్కడ అసలైన పాయింట్. గతంలో రైతు చట్టాలను వెనక్కి తీసుకొని.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘనవిజయం సాధించారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములా ప్రయోగిస్తారని. అందువల్లే ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper