
ఐపీఎల్ 2020 మ్యాచ్‌లో సరిగ్గా ఆడలేదని ఓ యువకుడు ధోనీ కూతురు జీవాపై అసభ్యకర కామెంట్లు చేశారు. ఆ యువకుడిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్ల ముంద్రా ప్రాంతానికి చెందినవాడిగా రాంచీ పోలీసులు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆ పోస్టు చేసింది తానేనని ఒప్పుకున్నాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోని ప్రవర్త్తన వల్లే ఓడిపోయిందని ఆ యువకుడు ధోని కూతరుపై అసభ్యకర పోస్టు చేశాడు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు మొత్తానికి యువకుడిని అదుపులోకి తీసుకునాన్రు.