Homeజాతీయ వార్తలుCorporate Hospitals Money Scams: డబ్బు కోసం ఆసుపత్రులు ఎంతకు దిగజారుతాయంటే.. లేడీ డాక్టర్ బయటపెట్టిన...

Corporate Hospitals Money Scams: డబ్బు కోసం ఆసుపత్రులు ఎంతకు దిగజారుతాయంటే.. లేడీ డాక్టర్ బయటపెట్టిన నిజం

Corporate Hospitals Money Scams: ఠాగూర్ సినిమా చూశారా .. అందులో ఒక వ్యక్తి చనిపోతాడు. అతడిని చిరంజీవి ఒక కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్తాడు. డబ్బు ఎంత ఖర్చైనా సరే పర్వాలేదు.. బతికించాలని కోరుతాడు. వచ్చిందే అవకాశంగా ఆ ఆస్పత్రి నిర్వాహకులు డబ్బులు లాగుతారు. చివరికి పేషెంట్ చనిపోయాడని చెబుతారు. దీంతో చిరంజీవి తన ప్లాన్ మొదలు పెడతాడు.. ఆ హాస్పిటల్ మొత్తాన్ని సీజ్ చేసే దాకా వదిలిపెట్టడు. ఇటువంటి సంఘటనలు కేవలం సినిమాలోనే చూపిస్తారు అనుకుంటే […]

Corporate Hospitals Money Scams: ఠాగూర్ సినిమా చూశారా .. అందులో ఒక వ్యక్తి చనిపోతాడు. అతడిని చిరంజీవి ఒక కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్తాడు. డబ్బు ఎంత ఖర్చైనా సరే పర్వాలేదు.. బతికించాలని కోరుతాడు. వచ్చిందే అవకాశంగా ఆ ఆస్పత్రి నిర్వాహకులు డబ్బులు లాగుతారు. చివరికి పేషెంట్ చనిపోయాడని చెబుతారు. దీంతో చిరంజీవి తన ప్లాన్ మొదలు పెడతాడు.. ఆ హాస్పిటల్ మొత్తాన్ని సీజ్ చేసే దాకా వదిలిపెట్టడు.

ఇటువంటి సంఘటనలు కేవలం సినిమాలోనే చూపిస్తారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మనదేశంలో కార్పొరేట్ హాస్పిటల్స్ పాల్పడే దందా మామూలుగా ఉండదు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. డబ్బులు దండుకునే హాస్పిటల్స్ ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. కార్పొరేట్ ఆసుపత్రుల దందా ఎలా ఉంటుందో కరోనా సమయంలో అందరికీ అవగతమైంది. వైద్యం పేరుతో డబ్బులు లాగడం.. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరిన పేషంట్ల నుంచి ముక్కు పిండి వసూలు చేయడం వంటివి కార్పొరేట్ దందాలో ఒక భాగమే.

కార్పొరేట్ ఆసుపత్రుల దందా గురించి అక్కడ పనిచేసే వైద్యులు బయటికి చెప్పరు. కానీ ఓ మహిళా వైద్యురాలు దాని పనిచేస్తున్న హాస్పిటల్ లో జరుగుతున్న దారుణం గురించి బయట పెట్టింది.. ఎవరు అడ్మిట్ కావాలి.. ఐసీయూలో ఉండాలో ఓనర్ డాక్టరే డిసైడ్ చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. డబ్బుల కోసం వీలైనంత ఎక్కువ మందిని అడ్మిట్ చేసుకోవాలని తనకు సూచిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డ్యూటీలో చేరిన తొలి రోజు ఈ అనుభవం ఎదురు కావడంతో ఆమె తన విధులకు రాజీనామా చేశారు.

చండీగఢ్ ప్రాంతంలో కేవలం ఈ హాస్పిటల్ మాత్రమే కాదని.. అన్నింట్లో కూడా ఇదే తరహాలో దందా జరుగుతోందని ఆ మహిళ వైద్యురాలు వాపోయారు. వైద్యం కోసం వచ్చే పేషంట్ల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని.. అవసరం లేకున్నా ఐసీఈలో చేస్తున్నారని.. ఇష్టానుసారంగా మందులు రాస్తూ.. వాటిని పేషంట్ కు ఇవ్వకుండా.. మళ్లీ ఫార్మసీలో అమ్ముతున్నారని వివరించారు. ఆ మహిళా వైద్యురాలు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అంతేకాదు మన దేశంలో కార్పొరేట్ ఆసుపత్రుల దందా ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. మరి దీనిపై పంజా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper