Kisan Vikas Yojana Intrest Rates: ప్రస్తుత కాలంలో డబ్బు అయితే చాలా మంది సంపాదిస్తున్నారు. కానీ అనుకున్న ఆదాయం ఎవరికీ ఉండడం లేదు. కొందరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అంతకు ఎక్కువగా ఖర్చులు చేస్తున్నారు. అయితే మిగతావారు మాత్రం డబ్బును సేవ్ చేసిన దానిని బ్యాంకులో లేదా చిట్టి ల రూపంలో దాచుకుంటున్నారు. అయితే ఈ డబ్బు కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ చిట్టీలు వేసే వారికి ఆ డబ్బు తిరిగి వచ్చేవరకు భద్రత ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. అయితే బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న తక్కువ వడ్డీ మాత్రమే వస్తుంది. ఇలాంటి సమయంలో ప్రత్యేకమైన పథకంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అలాంటి స్కీమ్లో ఇదొకటి. దాని గురించి వివరాల్లోకి వెళితే..
Also Read: Annadata Sukhibhava vs PM Kisan benefits 2025: అన్నదాత సుఖీభవ..రైతుల ఖాతాల్లో డబ్బులు పడేది అప్పుడే!
ఇటీవల కొన్ని ప్రైవేట్ కంపెనీలు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయండి.. రెట్టింపు ఇస్తాం అని చెబుతున్నాయి. కానీ ఇలా మనీని సేకరించిన తర్వాత కంపెనీలు మూసేస్తున్నాయి. అయితే ప్రభుత్వమే ఓ పథకం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో రూ. 1000 నుంచి లక్ష వరకు పెట్టుబడి పెడితే అంతకు రెట్టింపు వస్తుంది. ఇది ప్రభుత్వ స్కీం కాబట్టి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా డబ్బు సెక్యూరిటీ కూడా ఉంటుంది.
ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే’కిసాన్ వికాస యోజన’ అనే ఈ పథకంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి. అయితే ఒకసారి పెట్టుబడులు పెట్టిన తర్వాత 115 నెలల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే కనీసం 10 సంవత్సరాలు ఈ డబ్బు గురించి ఆలోచించవద్దు. అయితే పిల్లల భవిష్యత్తు లేదా ఇతర అవసరాల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకునేవారు ఒక్కసారిగా దీనిని పెట్టుబడులు పెట్టొచ్చు. వీటిని పోస్ట్ ఆఫీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది.
Also Read: PM Kisan: రైతన్నకు శుభవార్త.. పీఎం కిసాన్ 20వ విడత డేట్ వచ్చేసింది.. ఈ పని త్వరగా చేసేయండి
ఈ స్కీం లో పెట్టుబడులు పెట్టిన తర్వాత ఆ వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే ఎలా? అని కొందరికి సందేహం ఉంటుంది. అయితే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తి చివరి వరకు లేకపోతే అప్పటి వరకు డిపాజిట్ చేసిన మొత్తం తో పాటు వడ్డీతో సహా నామినీకి చెల్లిస్తారు. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసే సమయంలోనే నామినీ పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. ఇతర సంస్థల్లో.. ప్రైవేట్ వ్యక్తుల మధ్య పెట్టుబడులు పెట్టడం ద్వారా వడ్డీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ డబ్బుకు సెక్యూరిటీ ఉండే అవకాశం ఉండదు. అయితే లాంగ్ పీరియడ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకునే వారికి ఈ స్కీం వర్తిస్తుంది. అంతేకాకుండా పిల్లల వివాహానికి లేదా చదువు కోసం ఈ పథకం ఉపయోగపడనుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అన్ని వివరాలను తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్లాలని కొందరు ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.