Homeజాతీయ వార్తలుTelangana Formation Day- KCR: దశాబ్ది ఉత్సవాల వేళ తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ శుభవార్త..!

Telangana Formation Day- KCR: దశాబ్ది ఉత్సవాల వేళ తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ శుభవార్త..!

Telangana Formation Day- KCR: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేద ప్రజలకు శుభవార్త చెప్పారు. కొత్త సచివాలయం ఆవరణలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.

పేదలకు ఇళ్ల స్థలాలు..
గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాల్లో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 24 జిల్లాల్లో న్యూట్రీషియన్‌ కిట్లు పంపిణీ.. అలాగే రెండో విడత గొర్రెల పంపిణీ ఈనెల 9 నుంచి చేయనున్నట్టు తెలిపారు. ఇక గృహలక్ష్మి పథకం ప్రతీ నియోజకవర్గంలో వేల మంది లబ్ధిదారులకు రూ.3 లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి నిధులు ఇస్తామన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

50 వేల మందికి దళితబంధు..
ఇప్పటివరకు తెలంగాణలో 50 వేల మందికి దళిత బంధు అందించామని కేసీఆర్‌ ప్రకటించారు. రెండో విడతలో మరో 30 వేల దళిత కుటుంబాలకు రూ.10 లక్షల గ్రాంట్‌ ఇస్తామని సీఎం తెలిపారు. మిషన్‌ కాకతీయ ద్వారా 47 వేల చెరువులను పునరుద్ధరించారని.. మిషన్‌ భగీరథకు ఎన్నో అవార్డులు లభించాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా ఫ్లోరైడ్‌ బాధలు లేవన్నారు. హరితహారం ద్వారా పచ్చదనానికి పెద్దపీట వేశామన్నారు. తక్కువ కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని.. ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు.

కుల వృత్తులకు కానుక..
ఈ ఉత్సవాల కానుకగా బీసీ కుల వృత్తుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్ధిక సాయం చేయనున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు. పోడు భూములకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు హక్కులు కల్పిస్తామన్నారు. పోడు భూములకు రైతుబంధు వచ్చేలా చూస్తామని.. ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా మానవీయ కోణమే ఉంటుందన్నారు. ప్రతీ రంగంలో తెలంగాణ ముందుండి దేశానికి దిక్సూచిగా మారిందని తెలిపారు. దేశంలోనే బలీయమైన ఆర్ధిక శక్తిగా నేడు తెలంగాణ ఎదిగిందని పేర్కొన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper