spot_img
Homeజాతీయ వార్తలుKCR Third Front: త్వ‌ర‌లోనే మ‌రో టూర్ వేస్తున్న కేసీఆర్‌.. ఈసారి కూడా ఆయ‌న్ను తీసుకెళ్తార‌ట‌

KCR Third Front: త్వ‌ర‌లోనే మ‌రో టూర్ వేస్తున్న కేసీఆర్‌.. ఈసారి కూడా ఆయ‌న్ను తీసుకెళ్తార‌ట‌

Kcr Third Front:  ఏమో అనుకున్నాం గానీ.. కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజ‌కీయాల‌పై బాగానే ఫోక‌స్ పెడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. గ‌తంలో కూడా థ‌ర్డ్ ఫ్రంట్ అంటూ తిరిగిన కేసీఆర్‌.. ఆ త‌ర్వ‌త సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం గ‌ట్టి ప్లాన్‌తోనే ముందుకు వెళ్తున్న‌ట్టు తెలుస్తోంది. మొన్న‌టికి మొన్న త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌ను క‌లిసిన కేసీఆర్‌.. నిన్న ముంబై వెళ్లి సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేను, శ‌ర‌ద్ ప‌వార్‌ను క‌లిసి మాట్లాడారు.

deve gowda-kcr
deve gowda-kcr

బీజేపీ, కాంగ్రెస్ వ్య‌తిరేక కూట‌మి దిశ‌గా అడుగులు వేస్తున్న కేసీఆర్‌.. ఇందుకోసం లోక‌ల్ పార్టీల‌ను క‌లుపుకుని పోతున్నారు. అయితే వారంతా కూడా కేసీఆర్ చెప్పిన మాట‌ల‌కు ఒప్పుకున్న‌ట్టే తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌కు ప్ర‌త్యామ్నాయ వేదిక‌ను కేసీఆర్ ప్ర‌స్తావించ‌గా.. ఠాక్రే, ప‌వార్ ఒప్పుకున్న‌ట్టే కేసీఆర్ మాట‌ల్లో స్ప‌ష్టం అవుతోంది. ఈ జోష్ లోనే మ‌రో టూర్ చేప‌ట్ట‌నున్నారు కేసీఆర్‌.

Also Read:  ఐదు రాష్ట్రాల ఎన్నికలు: పంజాబ్ లో గెలుపెవరిది?

బెంగుళూరు వెళ్లి మాజీ ప్రధాని, జేడీఎస్‌ నేత దేవేగౌడను క‌ల‌వ‌నున్నారు కేసీఆర్‌. ఆయ‌న‌తో పాటు మాజీ సీఎం అయిన కుమార స్వామిని కూడా క‌లిసి చ‌ర్చించ‌నున్నారు. అయితే కేసీఆర్ కూట‌మి అంశాన్ని ప్ర‌స్తావించిన‌ప్పుడే.. అంద‌రికంటే ముందు ఫోన్ చేసి ప్ర‌శంసించింది కూడా దేవెగౌడ‌నే. గ‌తంలో కూడా ఓసారి ఆయ‌న్ను క‌లిశారు కేసీఆర్‌. కానీ ఇప్పుడు మాత్రం ప‌క్కా పొలిటిక‌ల్ ప్లాన్‌తోనే వెళ్తున్న‌ట్టు తెలుస్తోంది.

CM KCR
CM KCR

ఇక నిన్న కేసీఆర్ టీమ్ లో ప్ర‌కాశ్ రాజ్ ఉండ‌టం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి చేసింది. ఇప్పుడు బెంగుళూరు మీటింగ్‌లో కూడా ఆయ‌నే కీల‌కం కానున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న‌ది కూడా క‌ర్నాట‌క‌నే కావ‌డం, పైగా గ‌తంలోనూ కేసీఆర్ దేవెగౌడ‌ను క‌లిసినప్పుడు ప్ర‌కాశ్ వెంటే ఉన్నారు. కాబ‌ట్టి ఇప్పుడు కూడా ఆయ‌నే కీల‌కం అవుతార‌ని అంతా చ‌ర్చించుకుంటున్నారు. చూడాలి మ‌రి కేసీఆర్ ఇలా మ‌రి ఇంకెంత మందిని క‌లుపుకుని ఫ్రంట్ ఏర్పాటు చేస్తారో.

Also Read:  కొత్త జీవోల‌తో భారీగా పెరిగిన ట్రాఫిక్ చ‌లాన్లు.. రోడ్డెక్కాలంటేనే వ‌ణికిపోతున్న జ‌నాలు..!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper