spot_img
Homeజాతీయ వార్తలుKCR And Jagan And MK Stalin: ముగ్గురూ ముగ్గురే.. కెసిఆర్, జగన్, స్టాలిన్ కు...

KCR And Jagan And MK Stalin: ముగ్గురూ ముగ్గురే.. కెసిఆర్, జగన్, స్టాలిన్ కు సేమ్ సీన్

KCR And Jagan And MK Stalin: రాజకీయాల్లో హత్యలు ఉండవు అంటారు. అన్ని ఆత్మహత్యలే అంటారు. ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ ఓటమి అలానే ఉంది. అహంకార పూరిత నిర్ణయాలు, ప్రత్యర్థుల అణచివేతలకు ప్రజలు ఇష్టపడరని తేలిపోయింది. తమిళనాడులో గెలుపు బాటలో ఉన్న అధికార పార్టీ డిఎంకె అనూహ్యంగా ఓడిపోయింది. ఎన్నికలకు ముందు నుంచే సర్వేలు, ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ లో ముందంజలో ఉండేది ఆ పార్టీ. కానీ ఆ అంచనాలకు భిన్నంగా దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే స్టాలిన్ ఓటమితో ఒక్క విషయాన్ని చెప్పగలం. తమిళనాడు ఫలితాలతో తెలుగు రాష్ట్రాలకు సంబంధాలు ఉన్నాయి. 2023లో కేసీఆర్ ఓడిపోయారు. 2024లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. 2026లో స్టాలిన్ ఓడిపోయారు. ఈ ముగ్గురు స్నేహితులు. పరస్పర రాజకీయ ప్రయోజనాలకు సహకరించుకునేవారు. కానీ వీరి స్నేహం అహంకారపూరిత ద్వారానికి దారితీసింది ఒకరి నుంచి ఒకరికి. దాని పర్యవసానాలు ఆ పార్టీలకు ఓటములు.

* పెద్దదిక్కుగా కెసిఆర్..
జగన్మోహన్ రెడ్డి తో( Y S Jagan Mohan Reddy ) పాటు స్టాలిన్ కు పెద్దదిక్కుగా ఉండేవారు కేసిఆర్. ముందుగా 2014లో ఆయన తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయ్యారు. కానీ చంద్రబాబు పెద్దన్న పాత్రను ఎంత మాత్రం ఇష్టపడేవారు కాదు కెసిఆర్. అలా ఆయన రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డిని దగ్గరకు తీసుకున్నారు. చంద్రబాబుకు ఇబ్బంది పెట్టాలన్న కోణంలో జగన్మోహన్ రెడ్డికి ఎనలేని ప్రోత్సాహం అందించేవారు. అయితే ఇద్దరికీ ఒక సారూప్యత ఉండేది. అదే అహంకారపూరిత ధోరణి. అయితే కెసిఆర్ జగన్మోహన్ రెడ్డిని ప్రభావం చూపడం కంటే.. జగన్మోహన్ రెడ్డి కెసిఆర్ పై విపరీతంగా ప్రభావం చూపారు. 2014లో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ తెలంగాణ సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేశారో.. అప్పటినుంచి కెసిఆర్ సైతం ప్రజలకు దూరమయ్యారు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలకు అందనంత దూరంగా ఉండి పాలన చేశారు. 2018 నుంచి 2023 వరకు కేసిఆర్ కూడా ప్రజలకు దూరమయ్యారు. తెలంగాణ ఉద్యమానికి సహకరించిన వారిని పక్కన పెట్టేశారు. కేవలం మేము అనే అహంకార ధోరణితో ముందుకు సాగడం వల్లే 2023లో ఓటమిపాలయ్యారు. అదే తీరుకు అలవాటు పడిన జగన్మోహన్ రెడ్డి 2024 లో ఓడిపోయారు.

* విపరీత ధోరణితో స్టాలిన్..
సాధారణంగా చుట్టూ పెరిగే వాతావరణం, మన స్నేహితులు బట్టి మన నడవడిక ఉంటుంది. స్టాలిన్ విషయంలో కూడా అదే జరిగింది. కేవలం కెసిఆర్ తో పాటు జగన్ తో ఉన్న స్నేహం వల్లే ఆయన ఓడిపోయారు అనేది ఒక విశ్లేషణ. స్టాలిన్ సైతం తన చుట్టూ ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి మాదిరిగా. సామాన్యులకు దూరంగా ఉంటారన్న విమర్శను మూటగట్టుకున్నారు. ప్రజల మధ్య కాకుండా ప్యాలెస్ నుంచి పాలన సాగిస్తారన్న అపప్రద ఆయనపై ఉంది. ఆ కారణంతోనే ఆయన ఫెయిల్ అయ్యారు. ఇక్కడ మరో కారణం చూడాలి. ప్రత్యర్థులను అణగదొక్కడంలో ముగ్గురుకు ముగ్గురు సాటే. దాని పర్యవసానంగా ప్రత్యర్థులు రాజకీయంగా బలపడ్డారు. ఈ ముగ్గురు బలహీనపడ్డారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper