spot_img
Homeఆంధ్రప్రదేశ్‌స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం ఒక్కరిదేనా..? : అందరిది కాదా!

స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం ఒక్కరిదేనా..? : అందరిది కాదా!

Vizag Steel Plant
విశాఖపట్నం.. ఈ పేరు వినగానే అందమైన సాగర తీరం మన కళ్లముందు కదలాడుతుంది. అదే సమయంలో స్టీల్ ప్లాంట్‌ కూడా గుర్తొస్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నలు దిక్కులూ పిక్కటిల్లేలా ఒక్కపెట్టున సాగిన ఉద్యమం గుర్తొస్తుంది. ఈ పోరులో ఏకంగా 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవంగా విశాఖ ఉక్కు ఉంది. అయితే ఇప్పుడు ఆ ఆత్మగౌరవం ప్రైవేట్ పరం చేసే యోచనలో కేంద్రం ఉంది. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడం తప్పదా? ప్రైవేట్ వారి చేతుల్లోకి వెళ్తే ఉక్కు ధరలకు అడ్డు అదుపు ఉంటాయా?

Also Read: జగన్‌ ఢిల్లీ పర్యటనల్లో జరుగుతున్నదేంటి..? : చెప్పేదొకటి.. జరిగేదొకటా..!

ఇప్పటితరానికి ఆ ఉద్యమం గురించి తెలియదు. వెంకయ్యనాయుడు వంటి నేతలు విద్యార్ధి దశలోనే నాయకులుగా మారినప్పుడు.. చేసిన పోరాటాల్లో ‘విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు’ విజయవంతం. విశాఖలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఆనాడు జరిగిన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారు ఉన్నారు. నాడు ఒక్క విశాఖలో మాత్రమే ఆ ఉద్యమం జరగలేదు. ఏపీ మొత్తం నడిచింది. ఆ ఉద్యమ ఫలితంగానే స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. దేశ మౌలిక సదుపాయాల రంగంలో స్టీల్ ప్లాంట్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతింతై అన్నట్లుగా ఎదిగిన స్టీల్ ప్లాంట్‌ను ఇప్పుడు నష్టాల పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నారు.

ఇప్పుడు ప్రజలు మళ్లీ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. స్టీలు ప్లాంట్‌లోని వందశాతం వాటాలు అమ్మేస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ.. ప్రజల్లో మాత్రం ఏ మాత్రం ఎమోషన్ కనిపించలేదు. రాజకీయ పార్టీల్లోనూ నామమాత్రమే. ఎక్కడా స్పందన లేదు. చివరికి ఉత్తరాంధ్ర నేతల్లోనూ అలజడి లేదు. రామ్మోహన్ నాయుడు లాంటి యువ ఎంపీ మాత్రం దూకుడుగా స్పందిస్తున్నారు. మిగతా వారంతా సైలెంట్ గా ఉండిపోయారు. ప్రాణత్యాగాలు చేసి మరీ తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టేస్తే ఎవరిలోనూ ఎలాంటి చలనం ఎందుకు రావడం లేదనేది ప్రశ్న.

Also Read: ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలు ఎన్నో తెలుసా..!

ఇక.. ఉత్తరాంధ్రలోనే పెద్దగా ఎవరికీ పట్టకపోతే ఇతర ప్రాంతాల్లోని వారు పట్టించుకునే చాన్స్ లేదు. రాష్ట్ర రాజధాని అమరావతిని ఆ 29 గ్రామాల సమస్య అన్నట్లుగా చూశారు. వారు పోరాటం చేస్తుంటే.. మాటల్లో కూడా సానుభూతి చూపించలేదు. ఆ అమరావతి అందరి రాజధాని అనే భావనకు రాలేకపోయారు. ఇప్పుడు ఆ పార్టియాలిటీ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ సమస్య ఒక్క ఉద్యోగులదే అనుకునే పరిస్థితే వస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ జరిగితే అది అక్కడి ఉద్యోగులకే ఇబ్బంది కానీ.. ప్రజలకు కాదని అనుకునే పరిస్థితి వచ్చింది. ప్రజల్లో ఈ భావనను రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తున్నాయి. అందుకే వారిలోని ఐక్యత దెబ్బతింటోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Abhishek Sharma

Abhishek Sharma: టీమిండియా వర్సెస్ జింబాబ్వే: అరుదైన ఘనతకు చేరువలో అభిషేక్ శర్మ..

Abhishek Sharma: పొట్టి క్రికెట్ ఫార్మాట్లో టీమ్ ఇండియాకు తిరుగులేని ఆయుధం లాంటి ఆటగాడు అభిషేక్ శర్మ. అతడికి ఫామ్ తో సంబంధం ఉండదు. బౌలర్ ఎవరనేది లెక్క ఉండదు. మైదానం...
Oktelugu Epaper