Homeజాతీయ వార్తలుModi Operation 2.0: ఎవ్వరినీ వదలం.. ఆపరేషన్ 2.0కు మోడీ రెడీ అవుతున్నాడా?

Modi Operation 2.0: ఎవ్వరినీ వదలం.. ఆపరేషన్ 2.0కు మోడీ రెడీ అవుతున్నాడా?

Modi Operation 2.0: ఢిల్లీలో సోమవారం ఎర్రకోట సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ వద్ద కారులో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. ఈ వ్యవహారం లో ఉగ్ర కుట్ర కోణం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఘటన కంటే ముందుగానే పోలీసులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.. వారి వద్ద పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.. ఈ ఘటన జరిగిన అనంతరం ఢిల్లీలో […]

Modi Operation 2.0: ఢిల్లీలో సోమవారం ఎర్రకోట సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ వద్ద కారులో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. ఈ వ్యవహారం లో ఉగ్ర కుట్ర కోణం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఘటన కంటే ముందుగానే పోలీసులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.. వారి వద్ద పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.. ఈ ఘటన జరిగిన అనంతరం ఢిల్లీలో బాంబు పేలుడు చోటు చేసుకోవడం విశేషం.

సరిగా బీహార్ ఎన్నికలకు ఒకరోజు ముందుగానే ఈ ఘటన జరగడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. విపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు.. కాదు ఉగ్రవాదులకు ఆయన నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. మూలల్లోకి వెళ్తామని.. దాక్కున వారిని బయటికి లాగుతామని.. దేశం పై దాడికి పాల్పడిన వ్యక్తులకు కఠిన శిక్ష విధిస్తామని హెచ్చరించారు..

పహల్గామ్ దాటి తర్వాత నరేంద్ర మోడీ ఇదేవిధంగా ఇంగ్లీష్ లో మాట్లాడారు. తగ్గట్టుగానే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ మొదలైంది. పాకిస్తాన్లో దాక్కుని ఉన్న ఉగ్రవాదులపై.. ఉగ్రవాదుల శిబిరాలపై భారత భద్రత దళాలు దాడులు చేశాయి. అత్యంత ఖచ్చితమైన దాడులతో ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేశాయి.

భూటాన్ పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీ కూడా ఇప్పుడు ఇంగ్లీషులో మాట్లాడారు. ఉగ్రవాదులకు నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రకారం చూసుకుంటే ఆపరేషన్ సిందూర్ 2.0 కు నరేంద్ర మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కనిపిస్తోందని తెలుస్తోంది. దీనికి తోడు భారత హోం శాఖ మంత్రి అమిత్ షా ఇంటెలిజెన్స్ వర్గాలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ ప్రకారం భారీ ఆపరేషన్ కు భారత ఆర్మీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper