Rajinikanth-Kamal Haasan movie: గత కొన్ని రోజుల నుంచి రజినీకాంత్ – కమల్ హాసన్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోందంటు చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి. ఇక రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. మొదట్లో ఈ సినిమా లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో తెరకెక్కుతోందనే వార్తలు వచ్చినప్పటికి సుందర్ సి డైరెక్షన్ లో సినిమాని అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లతో ఈ సినిమా ఉంటుందని ఊహించిన ప్రతి ఒక్కరికి నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఒకప్పుడు రజినీకాంత్ తో అరుణాచలం లాంటి సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన సుందర్ సి దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ సినిమా రూపొందుతోంది. రీసెంట్ గా ఆయన చేసిన హర్రర్ సినిమాలకు పెద్దగా ప్రేక్షకుల నుంచి స్పందన రాకపోయినప్పటికి ఆయనను నమ్మి ఈ ఇద్దరు స్టార్ హీరోలు అతనికి డేట్స్ ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…ఇక ఇప్పటివరకు సుందర్ సి సాధించిన విజయాలు చాలా తక్కువనే చెప్పాలి. ఈ సమయంలో ఆయనతో సినిమా చేయడం ఎందుకని చాలా మంది సన్నిహితులు వాళ్లకు సలహాలను ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన అవుట్ డేటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇన్నోవేటివ్ థాట్స్ తో ప్రేక్షకులను మెప్పించగలిగే సినిమాలను చేయడంలో ఆయన చాలావరకు వెనకబడిపోయాడు.
కాబట్టి ఆయన డైరెక్షన్ లో సినిమా చేయడానికి కమిటై ఈ హీరోలు తప్పు చేస్తున్నారా? అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం… రజనీకాంత్, కమలహాసన్ కాంబినేషన్ లో సినిమా అనేది చాలా ప్రెస్టేజీయస్ ఇష్యూతో కూడుకున్నది. కాబట్టి చాలామంది అభిమానులు ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
రజినీకాంత్ కమల్ హాసన్ అభిమానులనే కాకుండా సగటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా వస్తే చూడడానికి ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వీళ్లిద్దరు లెజెండరీ యాక్టర్స్ కాబట్టి ఇండియా మొత్తం మీద వీళ్ళ నుంచి వచ్చే సినిమాకి గొప్ప క్రేజ్ అయితే ఉంటుంది.
మరి అలాంటి క్రేజ్ ఉన్న సినిమాని ఇలాంటి ఒక అవుట్ డేటెడ్ డైరెక్టర్ తో చేయించడం కరెక్ట్ కాదు అంటూ రజనీకాంత్ సన్నిహితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక ఈ డైరెక్టర్ నే ఫైనల్ చేస్తారా? లేదంటే మరెవరినైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…