Nandamuri Tejaswini ad film: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నందమూరి నట సింహంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు… ఎన్నో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొని సినిమాలను చేసి స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక తన రెండో కూతురు అయిన తేజస్విని సైతం బాలయ్య బాబు ఎలాంటి సినిమాలు చేయాలి. ఆయనను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారు అనే విషయాల మీద పూర్తి అవగాహనను తెచ్చుకొని అలాంటి కథలనే బాలయ్య బాబు కోసం ఎంపిక చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
తేజస్విని రీసెంట్ గా ఒక యాడ్ ఫిలిం లో నటించిన విషయం మనకు తెలిసిందే… ‘సిద్ధార్థ ఫైన్ జ్యువెలరీ’ ఆడ్ ఫిలింలో నటించి ప్రేక్షకులందరిని అబ్బురపరిచారు. నిజానికి ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఎలాగైతే నటిస్తారో ఆమె కూడా అలాంటి గొప్ప నటనను ప్రదర్శించి ప్రతి ఒక్కరిని ఆకర్షించింది… ఇక మొదట ఈ ఆడ్ ఫిలిం త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గరికి వెళ్లిందట.
ఆయన వెంకటేష్ సినిమాలో బిజీగా ఉండటం వల్ల చాలా రోజుల నుంచి తనకు పరిచయం ఉన్న కిషోర్ అనే ఒక యాడ్ ఫిలిం మేకర్ కి ఈ ప్రాజెక్ట్ ని అప్పగించారట. దాంతో కిషోర్ ఈ ప్రాజెక్టుని చాలా సక్సెస్ఫుల్గా డీల్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ యాడ్ ఫిలిం ద్వారా తేజస్వినిలో కూడా ఒక నటి ఉన్నారనే విషయాన్ని ప్రేక్షకులకు చెప్పకనే చెప్పారు. మరి ఇక మీదట కూడా తాను ఫ్యూచర్లో సినిమాల్లో నటించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. హీరోయిన్ గా నటించక పోయినా కూడా కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లలో తను నటించి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
నందమూరి ఫ్యామిలీ లో నటనకి కొదువు ఉండదన్న విషయం మనందరికి తెలిసిందే… ఇప్పటివరకు ఆ ఫ్యామిలీ నుంచి నట వారసులు మాత్రమే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కానీ ఆ ఫ్యామిలీ నుంచి మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చిన మొదటి నట వారసురాలుగా తేజస్విని ఒక చరిత్ర క్రియేట్ చేసిందనే చెప్పాలి…