Homeజాతీయ వార్తలుIran Donation Scam Kashmir: ఇరాన్‌ పేరుతో విరాళాలు.. ఉగ్రవాదులకు మళ్లింపు.. కశ్మీర్‌లో మరో కుట్ర!

Iran Donation Scam Kashmir: ఇరాన్‌ పేరుతో విరాళాలు.. ఉగ్రవాదులకు మళ్లింపు.. కశ్మీర్‌లో మరో కుట్ర!

Iran Donation Scam Kashmir: గల్ఫ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడులు చేస్తోంది. ఈ సమయంలో జమ్మూ కశ్మీర్‌లో ఒక పెద్ద ఘటన జరిగింది. మన ఇంటలిజెన్స్‌ విభాగం ఈ పరిణామాన్ని గుర్తించింది. ఇరాన్‌కు సహాయంగా డబ్బులు అడుగుతున్నారు కొందరు. ఇరాన్‌లో బాధిత ముస్లింల కోసం సాయం చేయాలని స్టాల్స్‌ కూడా ఏర్పాటు చేశారు. చాలా మంది ఇరాన్‌పై ఉన్న ఎమోషన్‌తో, మతపరమైన సెస్సిటివిటీతో డబ్బులు ఇచ్చారు. మసీదుల నుంచి కూడా ఇరాన్‌లోని పేదలకు, బాధితులకు […]

Iran Donation Scam Kashmir: గల్ఫ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడులు చేస్తోంది. ఈ సమయంలో జమ్మూ కశ్మీర్‌లో ఒక పెద్ద ఘటన జరిగింది. మన ఇంటలిజెన్స్‌ విభాగం ఈ పరిణామాన్ని గుర్తించింది. ఇరాన్‌కు సహాయంగా డబ్బులు అడుగుతున్నారు కొందరు. ఇరాన్‌లో బాధిత ముస్లింల కోసం సాయం చేయాలని స్టాల్స్‌ కూడా ఏర్పాటు చేశారు. చాలా మంది ఇరాన్‌పై ఉన్న ఎమోషన్‌తో, మతపరమైన సెస్సిటివిటీతో డబ్బులు ఇచ్చారు. మసీదుల నుంచి కూడా ఇరాన్‌లోని పేదలకు, బాధితులకు సహాయం చేయండి అని పిలుపు ఇచ్చారు. దీంతో చాలా మంది డబ్బులు ఆభరణాలు, పెంపుడు జంతువులు, విలువైన వస్తువులు, పింఛన్‌ డబ్బులు, సేవింగ్స్‌ ఇవ్వడం మొదలు పెట్టారు.

భావోద్వేగ స్పందన
గల్ఫ్‌ ఉద్రిక్తతలు, అమెరికా దాడుల నేపథ్యంలో షియా బలమైన బద్గాం (రూ.9.5 కోట్లు), బారాముల్లా (రూ.4 కోట్లు), శ్రీనగర్‌ (రూ.2 కోట్లు) ప్రాంతాల్లో మసీదులు, స్టాల్స్‌ ద్వారా విరాళాలు సేకరించారు. నగదు, ఆభరణాలు, స్కూపులు, పెంపుడు జంతువుల వరకు ఇచ్చిన ప్రజలు మత సానుభూతికి లొంగారు. ్ర2]్ర5]. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 14 వరకు రూ.17.91 కోట్లు వచ్చింది.

ఇంటలిజెన్స్‌ నిఘా..
ఇంటలిజెన్స్‌ అధికారులు ఈ డబ్బులు ఎటు వెళ్తున్నాయో తెలుసుకేందుకు నిఘాపెట్టారు. ఇరాన్‌కు వెళ్తుందా,, ఏం జరుగుతుదని గమనించారు. హతీం సజ్జార్‌ ప్రధానంగా కనిపించారు. ఇతను శ్రీనగర్‌లోని భగవాన్‌పురాలో ఉంటాడు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుకు ముందు జరిగిన వేర్పాటువాద ఉద్యమాల్లో పాల్గొన్నాడు. యువకులను పోగుచేసి రాళ్లదాడి చేయించాడు. మరోవ్యక్తి సయ్యద్‌ రుహల్లా రిజ్వీ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ఇతను గాందర్బల్‌ ప్రాంతానికి చెందినవాడు. ఇతను ఇరాన్‌లో ఉన్నాడు. వీళ్లిద్దరూ నిధులు సేకరించారు. లోతుగా గమనిస్తే వసలూ చేసిన విరాళాల్లో కొంత మాత్రమే ఇరాన్‌కు వెళ్లింది. మిగతాది వెనక్కు వచ్చింది. మాజీ ఉగ్రవాదుల ఖాతాలకు చేరింది. దాడులు చేయించిన వారికి అందింది. దీనిని ఇదివరకు ఉద్యమాలు చేసిన నెట్‌వర్క్‌ ఏజెన్సీ, వేర్పాటువాద మాజీ నాయకుల వద్దకు చేరింది. పాకిస్తాన్‌ అనుకూల వర్గాలకు అందుతోంది.

గతంలోనూ విరాళాలు..
ప్రీడం చాచా, మౌల్వీ సర్జద్‌ అహ్మద్‌ బర్కతీ (2016లో ఉగ్రవాది మరణానంతరం విరాళాలు సేకరించి జైలు శిక్ష), మసరత్‌ ఆలం, హుర్రియత్‌ మాజీ నాయకులు ఇలాంటి వ్యూహాలు ఉపయోగించారు. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన బర్కతీ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.

భద్రతా సవాళ్లు
ఇరాన్‌ యుద్ధ సానుభూతిని సద్వినియోగం చేసుకుని ఉగ్రవాదాన్ని పునరుజ్జీవనం చేసే ప్రయత్నాలు ఆందోళనకరం. ఇంటలిజెన్స్‌ నిఘా పెంచినా, మత భావోద్వేగాలు దుర్వినియోగానికి దారితీస్తున్నాయి. ప్రభుత్వం కఠిన చర్యలు, ప్రజల అవగాహన అవసరం.

ఇరాన్‌లో యుద్ధం జరుగుతంటే దానిపై ఉన్న సానుభూతిని సొమ్ము చేసుకుని, ఉగ్రవాదాన్ని పెంచే ప్రయత్నం జమ్మూ కశ్మీర్‌లో మొదలైంది. ఇప్పటికే రూ.17.91 కోట్లు సేకరించారు. ఇంతపెద్ద మొత్తం ఇరాన్‌ కోసం రావడం ఆశ్చర్యకరం. ఇందులో ఎక్కువ మొత్తం వేర్పాటు వాదులకు చేరడం ఆదోళన కలిగించే విషయం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper