Davos Investments in Telangana- AP: వారం రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారనేది ఎవరికీ తెలియడం లేదు. ఇప్పుడిదే అంతా హాట్ టాపిక్ గా మారింది. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు ముగిస్తే సీఎం జగన్ ఇంతవరకు రాష్ట్రానికి ఎందుకు తిరిగిరాలేదు. అక్కడ సదస్సులో ఆయన పాల్గొన్న రోజుల్లో మాత్రం ప్రభుత్వం నుంచి ప్రకటనలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఇప్పటివరకు చడీచప్పుడు లేదు. జగన్ వ్యక్తిగత, కుటుంబ పర్యటనల విషయంలో అంతా గోప్యత పాటిస్తున్నారు. అసలు దావోస్ పర్యటనలో రాష్ట్రానికి ఏం ఒరిగింది..? ముఖ్యమంత్రి జగన్ కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రత్యేక విమానంలో వెళ్లారు. తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్ కూడా వెళ్లారు. అయితే ఆ రాష్ట్రం చేసుకున్న ఒప్పందాలు, విశ్వసనీయత చూస్తే.. నిజమైన పెట్టుబడులుగా కనిపిస్తున్నాయని.. జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో ప్రచార పటాటోపం తప్ప.. ప్రత్యేకత ఏమీ లేదనే సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎవరిది విశ్వసనీయత?
దావోస్ సదస్సులో తెలంగాణకు మొత్తం రూ.4,200 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కీమో ఫార్మా, నోవార్టిస్, స్విస్‌రే త దితర కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలు పెట్టేందుకు అంగీకరించాయి. వాటిని నిర్దిష్ట కాలపరిమితిలోనే పెడతామని ప్రకటించాయి. ఆశీర్వాద్ పైపుల కంపెనీ కూడా రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టి ప్లాంట్ పెడతామని పేర్కొంది. ఇంకో ఆసక్తికర అంశం.. విశాఖనుంచి వెళ్లిపోయిన లులూ గ్రూప్ హైదరాబాద్‌లో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ విషయానికి వచ్చేసరికి ఎటువంటి స్పష్టత లేదు. కుదిరిన మూడు ఒప్పందాలు గ్రీన్ ఎనర్జీవే. భారీ పెట్టుబడులు వచ్చినట్లు చూపించడానికి, ప్రచారార్భాటానికి చేసుకున్నట్లుగా ఇవి ఉన్నాయని పరిశ్రమల వర్గాలు అంటున్నాయి.
Also Read: Congress Rajya Sabha List: సోనియా గట్టి షాక్ ఇచ్చిందే.. బీజేపీ అయినా ఓన్ చేసుకుంటుందా?

గ్రీన్‌కో, అదానీ, అరబిందో కంపెనీలతోనే కుదుర్చుకున్నారు. గ్రీన్‌కో ఇప్పుడు వచ్చిన కంపెనీ కాదు. చంద్రబాబు హయాంలోనే పెట్టుబడికోసం ఒప్పందాలు కుదుర్చుకుని పనులు కూడా ప్రారంభించింది. నాడు చంద్రబాబు హయాంలో ఒప్పందం చేసుకున్న ఈ కంపెనీతో జగన్‌రెడ్డి వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. అదే కంపెనీతో ఇప్పుడు వేల కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రకటించారు. అరబిందో కంపెనీ వైసీపీతో సన్నిహిత సంబంధాలున్న సంస్థ. పైగా సదరు కంపెనీ ప్రతినిధులు ఏపీలోనే పలుమార్లు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసినవారే. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిసేవారే. అదానీ గ్రూపుదీ అదే తీరు. ఈ కంపెనీ అధినేత గౌతమ్ అదానీ, ఇతర ప్రతినిధులు అనేకమార్లు ఇక్కడ సీఎంను వ్యక్తిగతంగా కలిసినవారే. వారే మళ్లీ దావోస్ లోనూ కలిసి ఒప్పందాలు చేసుకున్నారు. ఈ మూడూ కాకుండా ఒప్పందం చేసుకున్నది ఒకే ఒక సంస్థ. అది ఆదిత్య మిట్టల్ కంపెనీ. విశాఖలో ఇప్పటికే ఉన్న పెల్లెట్ కంపెనీ విస్తరణ కోసం ఒప్పందం చేసుకుంది. ఇంతకుమించి ఆటోమొబైల్ రంగంలో గానీ, ఫుడ్‌ప్రాసెసింగ్ రంగంలో కాని, టెక్స్‌టైల్స్‌లో గానీ, ఇతర రంగాల్లో గానీ కుదిరిన పెట్టుబడి ఒప్పందాలేమీ లేవు.
హైదరాబాద్ వైపు చూపు…
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా కంపెనీలు హైదరాబాద్ బాట పట్టాయి. విశాఖలో సుమారు రూ.2 వేల కోట్ల పెట్టుబడితో భారీ షాపింగ్‌మాల్, కన్వెన్షన్ సెంటర్, ఇతర ఏర్పాట్లతో అత్యద్భుతమైన మాల్‌ను నిర్మిస్తానని చంద్రబాబు హయాంలో లులూ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే జగన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక వెనక్కి వెళ్లిపోయింది. లులూ గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ స్వయంగా ఈ ప్రభుత్వం తమకు సహకరించలేదని విమర్శలు చేశారు. అలా వెళ్లిపోయిన లులూ గ్రూప్ ఇప్పుడు హైదరాబాద్‌లో ఫుడ్‌ప్రాసెసింగ్ రంగంలో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. వీటికి సంబంధించిన అనుమతులను కేటీఆర్ అప్పటికప్పుడే ఇచ్చేశారు. అదే సమయంలో లులూ గ్రూప్ హైదరాబాద్‌లో భారీ వాణిజ్య సముదాయాల నిర్మాణానికి కూడా సిద్ధమైంది. స్విట్జర్లాండ్‌కు చెందిన బ్యాంకింగ్, బీమా దిగ్గజం స్విస్‌రే తన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు కేటీఆర్‌తో చర్చల్లో అంగీకారం తెలిపింది.
Also Read:Gujarat Titans IPL 2022 Champion: ఐపీఎల్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్.. ఇంత ఈజీగా ఎలా గెలవగలిగింది?
Recommended Videos:
[…] Also Read: Davos Investments in Telangana- AP: పెట్టుబడులు తెలంగాణాకు… […]
[…] Also Read: Davos Investments in Telangana- AP: పెట్టుబడులు తెలంగాణాకు… […]