Homeజాతీయ వార్తలుProject KAL: వస్తోంది ‘కాల్‌’ యముడు.. పాకిస్తాన్‌కు దబిడి దిబిడే!

Project KAL: వస్తోంది ‘కాల్‌’ యముడు.. పాకిస్తాన్‌కు దబిడి దిబిడే!

Project KAL: ప్రస్తుతం ఏ యుద్ధం జరిగినా అందులో డ్రోన్స్‌ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల ఉక్రెయిన్‌ – రష్యా వార్‌లో, తాజాగా జరుగుతునర్న ఇరాన్‌–అమెరికా యుద్ధంతో, గతేడాది జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌లో డ్రోన్స్‌ కీలకపాత్ర పోషించాయి. అయితే గతేడాది వరకు మన వద్ద డ్రోన్స్‌ తక్కువగా ఉండేవి. తాజాగా యుద్ధాల్లో డ్రోన్స్‌ ప్రాధాన్యతను గుర్తించిన రక్షణ శాఖ… ఇప్పుడు వాటి తయారీపై ఫోకస్‌ పెట్టింది. అందులో భాగంగా సరికొత్త కాల్‌ డ్రోన్స్‌ను తయారు చేయిస్తోంది. ఇవి […]

Project KAL: ప్రస్తుతం ఏ యుద్ధం జరిగినా అందులో డ్రోన్స్‌ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల ఉక్రెయిన్‌ – రష్యా వార్‌లో, తాజాగా జరుగుతునర్న ఇరాన్‌–అమెరికా యుద్ధంతో, గతేడాది జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌లో డ్రోన్స్‌ కీలకపాత్ర పోషించాయి. అయితే గతేడాది వరకు మన వద్ద డ్రోన్స్‌ తక్కువగా ఉండేవి. తాజాగా యుద్ధాల్లో డ్రోన్స్‌ ప్రాధాన్యతను గుర్తించిన రక్షణ శాఖ… ఇప్పుడు వాటి తయారీపై ఫోకస్‌ పెట్టింది. అందులో భాగంగా సరికొత్త కాల్‌ డ్రోన్స్‌ను తయారు చేయిస్తోంది. ఇవి పాకిస్తాన్‌ పాలిట కాలరుద్రులు కాబోతున్నాయి. ఇవి ఇది తక్కువ ఖర్చుతో శత్రు ఎయిర్‌ డిఫెన్స్‌ను అధిగమించే సాంకేతికత కలిగినది.

డ్రోన్‌ లక్షణాలు
ప్రళయకాళ రుద్రుడు ఏఐ–ఆధారిత కామికాజే డ్రోన్, జీపీఎస్‌ లేకుండా లక్ష్యాన్ని స్వయంచాలకంగా గుర్తించి దాడి చేస్తుంది. ఇది 1000 కి.మీ. దూరం వరకు ప్రయాణించి, 3.5 గంటలు గాలిలో ఉండగలదు. 20–40 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్తుంది. రిమోట్‌ ఆపరేషన్, ఇమేజింగ్‌ సామర్థ్యాలు కలిగి శత్రువు రాడార్లకు తప్పుకుపోతుంది.

Also Read: ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులు.. రమ్మన్నప్పుడు రాకుండా ఇప్పుడు గగ్గోలు..

ప్రాజెక్ట్‌ KAL వివరాలు
కామికాజే ఆటానమస్‌ లాయిటరింగ్‌ లోయిటరింగ్‌ మునిషన్‌ (KAL) ప్రాజెక్ట్‌లో భాగంగా బెంగళూరు ప్రైవేట్‌ సంస్థ దీన్ని అభివృద్ధి చేస్తోంది, ఖర్చు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు మాత్రమే. ఏకకాలంలో అనేక డ్రోన్‌లు ప్రయోగిస్తే శత్రు డిఫెన్స్‌ సిస్టమ్‌ అధీకారికంగా యాక్టివేట్‌ అవుతుంది, దాడి సులభతరం అవుతుంది.

వ్యూహాత్మక ప్రాముఖ్యత
పాకిస్తాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌పై దీని దాడి భవిష్యత్‌ డ్రోన్‌ యుద్ధాల్లో కీలకం, రుద్రం క్షిపణులతో పోల్చితే తక్కువ ధరతో నిర్దేశిత దాడులకు అనుకూలం. భారత్‌ దీనితో శత్రువులకు భయపెట్టే సామర్థ్యం పెంచుకుంటుంది, రానున్న యుద్ధాల్లో ఆధిక్యత సాధిస్తుంది.

వెయ్యి కిలోమీటర్ల దూరం వెళ్తుంది. మూడున్నర గంటల వరకు గగనతలంలో ఉంటుంది. 20 నుంచి 40 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్తుంది. తక్కువ ఖర్చుతో తయారు చేసిన ఈ డ్రోన్స్‌తో ఏకకాలంలో పాకిస్తాన్‌కు భవిష్యత్‌లో చుక్కలు చూపించే అవకాశం ఉంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper