spot_img
Homeఆంధ్రప్రదేశ్‌అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన


తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు కరోనా మహమ్మరి విజృంభిస్తుంటే మరోవైపు అకాల వర్షాలు అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేసున్నాయి. పంట దిగుబడులు చేతికొచ్చే సమయంలో దేశంలో కరోనా ఎంట్రీతో రైతన్న పరిస్థితి అగమాగం అవుతోంది. కేంద్రం లాక్డౌన్ అమలు చేయడంతో ప్రజా రవాణా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. దీంతో పంటలను కోసేందుకు కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో ప్రతీగింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం కన్పించడం లేదని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ సెంటర్లలో సరైన సదుపాయాలు లేకపోవడంతో దిగుబడులను ఎలా కాపాడుకోలేకపోతున్నట్లు అన్నదాతలు వాపోతున్నారు.

అకాల వర్షాలు అన్నదాతకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మూడురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండొచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ ఛత్తీస్ గడ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని చెప్పారు. దీని ప్రభావంతో నేడు(మంగళవారం), రేపు(బుధవారం), ఎల్లుండి(గురువారం) వర్షాలు కురుస్తాయని తెలిపారు. తెలంగాణ, దక్షిణ కొస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.

దక్షిణ అండమాన్ సముద్రం ప్రాంతంలో ఈనెల 30న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 48గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారొచ్చని చెప్పింది. ఈమేరకు రైతులు, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రైతులు పంట దిగుబడులపై ముందస్తుగా టర్ఫాలిన్లు కప్పుకోవాలని సూచించింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Jana Nayagan First Day Collection

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
India vs Zimbabwe

India vs Zimbabwe: శనిగాడు ‘గంభీర్’ లేడు.. అందుకే టీమిండియా గెలిచింది.. లక్ష్మణ్ వ్యూహం ఫలించింది

India vs Zimbabwe: కాలుకు వేస్తే మెడకు వేస్తాడు. మెడకు వేస్తే కాలుకు వేస్తాడు. బోడి గుండుకు కొండకు ముడి పెడతాడు. వెంట్రుకతో లాగాలి అంటాడు. వింత వింత నిర్ణయాలు తీసుకుంటాడు. అవి...
NEET Paper Leak

NEET Paper Leak: పేపర్ లీక్ చేసే ఊహే రాకుండా.. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ఎంత కఠినంగా ఉందో...

NEET Paper Leak: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువకులు ఏకంగా పార్లమెంటు మీదికి దూసుకుపోయారు. కేంద్ర...
Tech Mahindra Employee

Tech Mahindra Employee: ఐటీ ఉద్యోగం అంటేనే పేక మేడ.. ఎప్పుడు ఊడుతుందో ఎవరికి ఎరుక.. పాపం ఈ...

Tech Mahindra Employee: ఇన్ని రోజులపాటు చేసిన చోట ఉద్యోగం లేదంటే.. ఆ ఉద్యోగి కి ఎంత కష్టం ఉంటుంది.. హాయిగా పని చేసుకుంటూ.. బ్రహ్మాండంగా జీతం తీసుకుంటూ.. జీవితాన్ని సాగిస్తున్న ఆమెకు...
Pawan Kalyan

Pawan Kalyan: క్యాబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. కారణం ఏంటంటే..

Pawan Kalyan: సచివాలయం లో నేడు సీఎం చంద్రబాబు నాయుడు అద్వర్యం లో జరిగిన క్యాబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు అవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం...
Oktelugu Epaper