Homeజాతీయ వార్తలుHDFC Bank Shocking News : కస్టమర్లకు షాకింగ్ న్యూస్..2 కఠిన నిర్ణయాలు తీసుకున్న HDFC...

HDFC Bank Shocking News : కస్టమర్లకు షాకింగ్ న్యూస్..2 కఠిన నిర్ణయాలు తీసుకున్న HDFC బ్యాంక్…

HDFC Bank Shocking News : హెచ్డిఎఫ్సి బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయాలు ఆ బ్యాంకు కస్టమర్లపై చాలా ప్రభావం చూపనున్నాయి. ఈ బ్యాంకు తమ బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటు పొదుపు ఖాతాలపై కూడా భారీగా వడ్డీ రేటులను తగ్గించడం జరిగింది. ఈ మధ్యకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రేపో రేట్లను తగ్గించిన నేపథ్యంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ కస్టమర్లకు తాజాగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక చేదు వార్త తెలిపింది. మనదేశంలో ఉన్న అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకులలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఒకటి. ఈ బ్యాంకులో ఎన్నో లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. తాజాగా ఈ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ లపై అలాగే సేవింగ్స్ ఖాతాలపై కూడా భారీగా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ఐసిఐసిఐ బ్యాంకు కూడా తమ వినియోగదారులకు వడ్డీ రేటులను తగ్గించి భారీ షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా ఈ కీలక నిర్ణయం తీసుకోవడంతో వినియోగదారులకు డబల్ షాక్ తగిలినట్లు అయింది. ఇటీవల రేపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ప్రకటించింది. అంటే ఆర్బిఐ రేపో రేటును 6 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్బిఐ తీసుకున్న ఈ నిర్ణయంతో అనేక బ్యాంకులు కూడా తమ బ్యాంకులలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ లపై అలాగే సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లలో కోత విధిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకులు తీసుకున్న ఈ కీలకమైన నిర్ణయాలు ఎఫ్డి పెట్టుబడిదారులతో పాటు ఆ బ్యాంకులో ఉన్న రుణ గ్రహీతలను కూడా బాగా ప్రభావితం చేస్తున్నాయి అని చెప్పొచ్చు. జూన్ 10, 2025 నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వస్తాయని సమాచారం.

ఇక లోన్లు తీసుకుంటున్న వారికి మాత్రం ఈ బ్యాంకులు కొంచెం ఊరట కలిగించాయి. 10 బేసిస్ పాయింట్లు రుణ రేట్లు తగ్గించి రుణం తీసుకునే వారికి శుభవార్త తెలిపాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తమ బ్యాంకులో ఉన్న ఎఫ్డి కస్టమర్లకు కనీసం 2.75 శాతం నుంచి గరిష్టంగా 6.60 శాతానికి వడ్డీ రేట్లను అందిస్తుంది. గతంలో ఎఫ్ డి లపై 3 శాతం నుంచి 6.85% వరకు అందించేది. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకులో సీనియర్ సిటిజన్స్ కి మాత్రం కనీసం 3.25% నుంచి 7.10% వరకు వడ్డీ రేట్లు లభిస్తున్నాయి. గతంలో సీనియర్ సిటిజన్స్ కి 3.5% నుంచి 7.35 శాతం వరకు వడ్డీ రేట్లు ఉండేవి.

Also Read : గ్లోబల్‌ బ్యాంకింగ్‌ రంగంలో భారత్‌ దూకుడు.. టాప్‌ 10లో నిలిచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...
Oktelugu Epaper