₹500 note ban: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది నిజమో? ఏది అబద్దమో? తెలుసుకోలేకపోతున్నారు. కొందరు తమ సోషల్ మీడియా ఖాతా ప్రాధాన్యత పొందడానికి ఎక్కువగా వైరల్ అయ్యే న్యూస్ ను తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా రూ. 500 నోట్లు రద్దు అవుతాయని కొందరు ప్రచారం చేశారు. ఈ నోట్ల రద్దు పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుందని కూడా ఇందులో చేర్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఫ్యాక్ట్ చెకింగ్ ఇది అబద్ధపు ప్రచారం అని.. దీనిని ప్రజలు నమ్మవద్దని తేల్చారు. అయితే 500 రూపాయల నోటు రద్దు పై ఎందుకు చర్చ వస్తుందంటే?
Also Read: రాజ్ భవన్ లోకి రాజావారు.. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు!
మోడీ ప్రభుత్వం 2016 నవంబర్ 8న రాత్రి నోట్ల రద్దు విషయాన్ని ప్రకటించింది. దీంతో అప్పటివరకు అందుబాటులో ఉన్న రూ. 1000, రూ.500 నోట్లను రద్దు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆర్థిక వివరాలు ఆగిపోయాయి. ఆ తర్వాత ప్రజల అవసరాల నిమిత్తం రూ.2,000 నోటును 2016 నవంబర్ 10 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇదే సమయంలో కొన్ని రోజుల తర్వాత రూమ్ 500 నోటును అందుబాటులోకి తీసుకొచ్చారు.అయితే పెద్ద నోట్లు అందుబాటులో ఉంటే అవినీతి జరిగే అవకాశం ఉందని భావించి… 2023 మే 19న రూ. 2000 నోటును రద్దు చేశారు.
ఈ సమయంలో రూ.500, 100 నోటు మాత్రమే చలామణిలో ఉండేది. అయితే ఆర్థిక వ్యవహారాలన్నీ సులభతరం చేయడానికి రూనోటును కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే ఇటీవల రూ. 500 నోటు ను రద్దు చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పెద్ద నోటు ఉండటంవల్ల అవినీతికి ఆస్కారం ఉండే అవకాశం ఉందని.. అలాగే డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రూ. 500 నోటు రద్దు చేస్తారని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని ఆర్బిఐ తెలిపింది. అంతేకాకుండా ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని పేర్కొంది.
Also Read: ఏపీకి మరో ఇంటర్నేషనల్ సంస్థ!
ఇది ఇలా ఉండగా కొందరు 500 ఫేక్ తయారు చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నారని చెబుతున్నారు. 500 నోటును గుర్తించడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. వీటిలో మొదటిది నోటును అటూ ఇటూ తిప్పినప్పుడు.. నోట్ పై ఉన్న మహాత్మా గాంధీ చిత్రం పక్కన 500 అంకె రంగులు మారుతూ ఉండాలి. దీనిపై ఉన్న గవర్నర్ సంతకం పక్కన త్రివర్ణ పతాకం ఉండాలి. మహాత్మా గాంధీ చిత్రం కుడి వైపున వాటర్ మార్కుతో 500 నెంబర్ కనిపించాలి. నోటుకు మధ్యలో ఒక సెక్యూరిటీ లైన్ ఉంటుంది. దీనిపై ఆర్బిఐ అని ఇంగ్లీషులో రాసి ఉంటుంది. నోటును అటూ ఇటూ తిప్పినప్పుడు స్వచ్ఛభారత్ లోగో అందులో కనిపిస్తుంది. నోటుపై ముద్రించిన నెంబర్లు స్పష్టంగా ఉన్నాయా? లేవా? అనేవి చెక్ చేసుకోవాలి. 500 నోటు 66 ఎంఎం x 150 ఎం ఎం సైజులో ఉంటుంది. ఇలా 500 ఫేక్ నోటును గుర్తించాలి.