spot_img
Homeజాతీయ వార్తలుGreat Nicobar Island Project Controversy: గ్రేటర్‌ నికోబార్‌ను అడ్డుకునే అదృశ్య శక్తులు.. అండగా నిలుస్తున్న...

Great Nicobar Island Project Controversy: గ్రేటర్‌ నికోబార్‌ను అడ్డుకునే అదృశ్య శక్తులు.. అండగా నిలుస్తున్న భారత దుష్ట శక్తులు!

Great Nicobar Island Project Controversy: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పూర్తికాగానే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అండనమాన్‌ నికోబార్‌కు వెళ్లారు. ఎప్పుడైనా ఆయన విదేశాలకు వెళ్తారు. కానీ ఈసారి అండమాన్‌ వెళ్లి.. అక్కడి గిరిజనులను, పక్షులు, జంతువులను కాపాడాలని కోరుతున్నారు. గ్రేటర్‌ నికోబార్‌ ప్రాజెక్టును ఆపేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. సోనియా గాంధీ కూడా ఇటీవల ఓ పత్రికలో పెద్ద వ్యాసం రాశారు. గ్రేటర్‌ నికోబార్‌ ప్రాజెక్టు కారణంగా పర్యావరణం దెబ్బతింటుందని తెలిపారు. దేశ రక్షణ, సార్వభౌమత్వం కన్నా పక్షలు, జంతువులనే కాపాడాలని అన్నట్లుగా ఈ వ్యాసతం ఉంది. పర్యావరణంపై బిజినెస్‌ చేసే స్వచ్ఛంద సంస్థలు కూడా వ్యాసాలు రాస్తున్నాయి. డిబేట్లు నిర్వహిస్తున్నాయి. వీరందిర లక్ష్యం గ్రేటర్‌ నికరోబార్‌ ఆపేయాలి.

ప్రాజెక్ట్‌ డీటెయిల్స్‌.. స్ట్రాటజిక్‌ అసెట్స్‌..
గ్రేటర్‌ నికోబార్‌ మలక్కా స్ట్రెయిట్‌కు కేవలం 40 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉంటుంది. దీని వెడల్పు కూడా హర్మూజ్‌ జలసంధిలాగే 2.8 కిలోమీటర్లు. మలక్కా జలసంధి గుండానే చైనా చమురు, వాణిజ్య రవాణా సాగుతోంది. చైనా 5 ట్రిలియన్‌ డాలర్ల వ్యాపారంలో 80 శాతం ఈ జలసంధి గుండానే సాగుతుంది. ఇక్కడ సుమారు రూ.85 వేల కోట్ల రూపాయలతో గ్రేటర్‌ నికోబార్‌ ప్రాజెక్టు చేపట్టింది కేంద్రం. 700 కిలోమీటర్ల పొడవునా ఉన్న అండమాన్‌ నికోబార్‌ ద్వీపాల సమూహం ఉంది. స్థిరమైన గోడలా ఉన్న ద్వీంప గ్రేటర్‌ నికోబార్‌. గ్రేటర్‌ నికోబార్‌ ప్రాజెక్టుతో చైనా నౌకలపై నిఘా ఉంటుంది. ఇక్కడి నుంచి సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంక సమాన దూరంలో ఉంటుంది. మలక్కా జలసంధి నుంచి హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించే సమయంలో 6 డిగ్రీ చానల్‌ను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ ఉంటుంది. గ్రేటన్‌ నికోబార్‌ నుంచి 200 కిలోమీటర్ల పరిధిలోని సముద్ర సంపద భారత్‌కు చెందుతుంది. ఇందుకోసం గ్రేటర్‌ నికోబార్‌ అవసరం. కానీ దీనిని అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ, స్వచ్ఛంద సంస్థలు, పత్రికలు పనిచేస్తున్నాయి.

చారిత్రక–అంతర్జాతీయ కాంటెక్ట్స్‌..
2003లో చైనా అధ్యక్షుడు హూ జింటావో మాలక్కా జలసంధిపై చైనా ఆధిపత్యం ఉండాలని ప్రతిపాదించాడు. ఇది చైనాకుకీలకమని పేర్కొన్నాడు. కానీ వాజ్‌పేయి ఫ్రధాని అయ్యే వరకూ దీనిని ఎవరూ పట్టించుకోలేదు. సుమారు 50 ఏళ్లు దేశాన్ని పాటించిన కాంగ్రెస్‌ దేశ భద్రత, చైనాతో మనకు ఉన్న ముప్పును ఎన్నడు అంచనా వేయలేదు. వాజ్‌పేయి వచ్చాక అండమాన్‌ నికోబార్‌ దీవులపై దృష్టి పెట్టారు. మోదీ వచ్చాక ఓమాన్‌లోని దుఖమ్‌ ఎయిర్‌పోర్టు, ఇండోనేషియాలోని సదర్న్‌ ఎయిర్‌పోర్టు, సెషెల్స్‌ నౌకా బేస్‌ భారత్‌ నిర్మిస్తోంది. వీటికి గ్రేటర్‌ నికోబార్‌ ప్రాజెక్టు కీలకం. ఇది పూర్తయితే క్వాడ్‌లో భాగంగా హింద్‌–పసిఫిక్‌ సెక్యూరిటీ. చైనా ’స్ట్రింగ్‌ ఆఫ్‌ పెరెల్స్‌’కు చెక్‌ పడుతుంది.

గ్రేటర్‌ నికోబార్‌లో ఇలా..
కేంద్రం గ్రేటర్‌ నికోబార్‌లో ట్రాన్షిప్‌మెంట్‌ పోర్టు నిర్మిస్తోంది. ఇంటర్నేషనల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మిస్తోంది. మన యుద్ధవిమానాలు అక్కడ ల్యాండ్‌ అవుతాయి. షిప్పులకు మరమ్మతులు కూడా ఇక్కడే చేసే అవకాశం ఉంటుంది. చైనాతో యుద్ధం వస్తే ఇవి కీలకంగా మారతాయి. చైనాకు అడ్డుకట్ట వేయడానికి, అమెరికాకు అడ్డుకట్ట వేయడానికి గ్రేటర్‌ నికోబార్‌ చాలా అవసరం. అయినా దీనిని అడ్డుకోవాలని మన దేశంలోని పార్టీలు, సంఘాలు, మీడియ చూస్తున్నాయి. తెలిసో తెలియకో వెస్ట్రన్, చైనా ప్రాపగాండాలో పడి గ్రేటర్‌ నికోబార్‌ను అడ్డుకోవాలని చూస్తున్నారు.

అన్ని అనుమతులు..
నిజానికి గ్రేటర్‌ నికోబార్‌ ప్రాజెక్టు ప్రారంభించక ముందు. 2022లో మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఫారెస్ట్‌ అండ్‌ కోస్టల్‌ సెక్యూరిటీకి సంబంధించిన క్లియరెన్స్‌ వచ్చాయి. 42 కండీషన్లు పెట్టాయి. వైల్డ్‌లైఫ్, జియోలాజికల్, బొటానికల్, ఆర్నిథాలజీ నుంచి అనుమతులు వచ్చాయి. 2052 వరకు జంతువులు, పక్షులు, పర్యావరణ పరిరక్షణకు ప్రాజెక్టులు నిర్వహిస్తాయి. ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. వాటిని కాపాడతారు. కోరల్స్‌ 90 శాతం అనుకూల పరిస్థితిలు ఉన్నాయి. ఎన్‌జీటీ కూడా అనుమతి ఇచ్చింది. అయినా ప్రాజెక్టును అడ్డుకోవడమే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారత వేశం చుట్టూ ముత్యాల హారంలా చైనా భారత్‌ చుట్టూ ఉన్న వివిధ దేశాల్లో పోర్టులు నిర్వహిస్తోంది. దీనికి చెక్‌ పెట్టడానికి భారత్‌ గ్రేటర్‌ నికోబార్‌ ప్రాజెక్టు చేపట్టింది.

క్వాడ్‌లో భాగంగా..
మన దేశం క్వాడ్‌లో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కలిసి హిందూ మహాసముద్ర జలాలు, పసిఫిక్‌ మహాసముద్ర జలాల సంరక్షణకు కృషి చేస్తోంది. ఓమాన్‌లోని దుఖమ్‌ ఎయిర్‌ పోర్టు, ఇండోనేషియాలోని సదర్న్‌ ఎయిర్‌ పోర్టును, సెషల్స్‌లో ఒక నౌకా స్థావరం ఏర్పాటు చేసి చైనా ఆధిపత్యానికి చెక్‌ పెట్టాలని భారత్‌ ప్రయత్నిస్తోంది. వీటికి కేంద్రబిందువు నికోబార్‌. అయినా దీనిని అడ్డుకోవాలని మన దేశంలోని పార్టీలు, సంఘాలు, మీడియా ప్రయత్నించడం గమనార్హం. ఈమేరకు వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. గ్రేటర్‌ నికోబార్‌ పూర్తయితే హిందూ మహాసముద్రంలో భారత్‌ బలమైన శక్తిగా ఎదుగుతుంది. మన ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవకాశం కలుగుతుంది.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper