Homeజాతీయ వార్తలుGermany: షార్ట్ వేసుకోవద్దని జర్మనీలో జర్మనీ లేడీలను అడ్డుకున్న బుర్ఖా మహిళలు.. తెగించేశారు.. వైరల్ వీడియో

Germany: షార్ట్ వేసుకోవద్దని జర్మనీలో జర్మనీ లేడీలను అడ్డుకున్న బుర్ఖా మహిళలు.. తెగించేశారు.. వైరల్ వీడియో

Germany: ఎవరైనా సరే ఈ భూమ్మీద తమకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు. తమకు నచ్చిన తిండి తినొచ్చు. తమకు నచ్చినట్టుగా ఉండవచ్చు. ఎందుకంటే మనిషి జీవితంలో స్వేచ్ఛ ఉండాలి. స్వాతంత్రం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా జీవించాలి. కానీ కొందరికి.. ముఖ్యంగా చాందసవాదులకు ఇటువంటివి అర్థం కావు. దుస్తులు ధరించే విషయంలో ఇబ్బంది పడతారు. తినే తిండి విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తారు. చివరికి వాళ్ళ బతుకులు వాళ్ళ బతుకుతున్నప్పటికీ.. అందులో నిప్పులు […]

Germany: ఎవరైనా సరే ఈ భూమ్మీద తమకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు. తమకు నచ్చిన తిండి తినొచ్చు. తమకు నచ్చినట్టుగా ఉండవచ్చు. ఎందుకంటే మనిషి జీవితంలో స్వేచ్ఛ ఉండాలి. స్వాతంత్రం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా జీవించాలి. కానీ కొందరికి.. ముఖ్యంగా చాందసవాదులకు ఇటువంటివి అర్థం కావు. దుస్తులు ధరించే విషయంలో ఇబ్బంది పడతారు. తినే తిండి విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తారు. చివరికి వాళ్ళ బతుకులు వాళ్ళ బతుకుతున్నప్పటికీ.. అందులో నిప్పులు పోస్తారు. అటువంటిదే ఈ సంఘటన కూడా.

యూరప్ ఖండంలో జర్మనీ అత్యంత ప్రముఖమైన దేశం. ప్రపంచంలో లగ్జరీ ఆటోమొబైల్ బ్రాండ్లకు ఈ దేశం పెట్టింది పేరు. ఇక్కడ కొంతకాలంగా ముస్లింల జనాభా పెరుగుతోంది. అది ఎంతకు పెరిగిపోయింది అంటే.. ఏకంగా అక్కడి ప్రజలనే ప్రశ్నించి.. రోడ్డుమీద పడేసేంతగా.. తాజాగా జరిగిన ఓ సంఘటన దీనికి బలం చేకూర్చుతోంది.

జర్మనీలోని ఓ ప్రాంతంలో ఓ మహిళ షార్ట్ ధరించి సైకిల్ తొక్కుకుంటూ రోడ్డు మీదకి వచ్చింది. అక్కడ కొంతమంది ముస్లింలు ఉన్నారు. అందులో మహిళలు కూడా ఉన్నారు. వరద కూడా బుర్ఖా ధరించి ఉన్నారు. అది మొత్తం ముస్లింలు నివసించే ప్రాంతం. అక్కడికి వచ్చిన ఆ జర్మనీ యువతిని ముస్లిం మహిళలు అడ్డగించారు.

షార్ట్ ఎందుకు ధరించావు.. ఇక్కడ పూర్తిగా ఇస్లామిక్ దుస్తులు మాత్రమే ధరించాలంటూ ఆమెను ప్రశ్నించారు. దానికి ఆ జర్మనీ యువతి తీవ్రస్థాయిలో మండిపడింది. నాకు నచ్చినట్టు నేనుంటాను.. మీరెవరు ప్రశ్నించడానికి అన్నట్టుగా అడిగింది. దానికివారు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంతలో మరొక యువకుడు అక్కడికి వచ్చాడు. వెంటనే ఆ జర్మనీ యువతిని రోడ్డుమీదికి లాక్కెళ్ళి నెట్టేసి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. జర్మనీలో జర్మనీ ప్రజలకు కాకుండా ముస్లింలకు ఎందుకు అధికారం.. స్థానికుల మీద వారి ఆధిపత్యం ఏంటి.. ధరించే దుస్తుల విషయాల్లో కూడా ఈ మూర్ఖత్వం ఏంటి అంటూ.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా జర్మనీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper