Homeజాతీయ వార్తలుNew FCRA Rules: విదేశీ నిధులతో మతమార్పిడి.. స్వచ్ఛంద సంస్థల తోక కత్తిరించిన మోదీ!

New FCRA Rules: విదేశీ నిధులతో మతమార్పిడి.. స్వచ్ఛంద సంస్థల తోక కత్తిరించిన మోదీ!

New FCRA Rules: దేశంలో కొన్ని స్వచ్ఛంద సంస్థల ముసుగులో, సేవా కార్యక్రమాల మాటున చేస్తున్న కార్యక్రమాలు దేశ భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. స్థానిక సంస్కృతిని దెబ్బతీస్తుంది. విదేశాల నుంచి విచ్చల విడిగా నిధులు సేకరిస్తూ.. హిందువలను మతం మారేలా కొన్ని సంస్థలు మచ్చిక చేసుకుంటున్నాయి. డబ్బు, సహాయం మాటున అరాచకాలు చేస్తున్నాయి. దీంతో ఇలాంటి సంస్థల తోక కత్తిరించాలని మోదీ సర్కార్‌ నిర్ణయించింది. విదేశాల నుంచి వచ్చే నిధుల విషయంలో ఎలాంటి ఒత్తిడికీ తలొగ్గకుండా కఠిన […]

New FCRA Rules: దేశంలో కొన్ని స్వచ్ఛంద సంస్థల ముసుగులో, సేవా కార్యక్రమాల మాటున చేస్తున్న కార్యక్రమాలు దేశ భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. స్థానిక సంస్కృతిని దెబ్బతీస్తుంది. విదేశాల నుంచి విచ్చల విడిగా నిధులు సేకరిస్తూ.. హిందువలను మతం మారేలా కొన్ని సంస్థలు మచ్చిక చేసుకుంటున్నాయి. డబ్బు, సహాయం మాటున అరాచకాలు చేస్తున్నాయి. దీంతో ఇలాంటి సంస్థల తోక కత్తిరించాలని మోదీ సర్కార్‌ నిర్ణయించింది. విదేశాల నుంచి వచ్చే నిధుల విషయంలో ఎలాంటి ఒత్తిడికీ తలొగ్గకుండా కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. నిదుల వినియోగంలో పారదర్శకత పెంపుతోపాటు దుర్వినియోగానికి చెక్‌ పెట్టింది.

విదేశీ నిధులపై కఠిన నిబంధనలు..
ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే నిధులను అక్రమంగా ఉపయోగించినట్లయితే జరిమానాలు విధించే వ్యవస్థను బలోపేతం చేసింది. ఏదైనా సంస్థ విదేశీ నిధులను తప్పుడు మార్గంలో ఖర్చు చేస్తే ఆ నిధులు జప్తు చేయడం, జరిమానాలు విధించడం వంటి చర్యలు తీసుకుంటోంది. ఈ నిర్ణయాలు ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు తమ కార్యకలాపాల్లో పారదర్శకంగా వ్యవహరించాలని బలవంతం చేస్తున్నాయి.

మత మార్పిడులకు అడ్డుకట్ట…
వైద్యం, విద్య, అన్నదానం వంటి సేవా కార్యక్రమాల పేరుతో మత మార్పిడులు జరిగే అవకాశాలను ప్రభుత్వం గుర్తించి, దానికి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధంగా ఉంది. విదేశీ నిధులు మతపరమైన మార్పిడులకు ఉపయోగపడకుండా నిరోధించడం ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం. ఇది దేశంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు తీసుకున్న ముఖ్యమైన చర్యగా చూస్తున్నారు.

లెక్కలు, ఆడిటింగ్‌ తప్పనిసరి…
వచ్చిన నిధులను ఎలా ఖర్చు చేశారో పూర్తి వివరాలు సమర్పించాలని, తప్పనిసరిగా ఆడిటింగ్‌ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. కేంద్ర బృందాలు వివిధ సంస్థలను తనిఖీ చేసే అధికారం కలిగి ఉంటాయి. ఈ వ్యవస్థ వల్ల నిధులు సరైన మార్గంలోనే ఉపయోగపడుతున్నాయని నిర్ధారించడం సాధ్యమవుతుంది. ఇది గతంలో జరిగిన అనేక అక్రమాలను నివారించేందుకు సహాయపడుతుందని నిపుణుల అభిప్రాయం.

జేడీ వాన్స్‌నే లెక్క చేయలేదు..
అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ జేడీ వాన్స్‌ కోల్‌కత్తాలోని మదర్‌ థెరీసా సేవా కేంద్రాన్ని సందర్శించినప్పటికీ, ఆ సంస్థకు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వకపోవడం ప్రభుత్వం అనుసరిస్తున్న నిష్పాక్షిక వైఖరిని స్పష్టం చేస్తోంది. ఏ సంస్థ అయినా నిబంధనలను పాటించాల్సిందేనని, ఎవరికీ మినహాయింపు ఉండదని ఈ సంఘటన ద్వారా సంకేతం ఇచ్చింది.

దేశంలో విదేశీ నిధుల ప్రవాహాన్ని నియంత్రించడంతో పాటు, స్వచ్ఛంద సంస్థలు మరింత జవాబుదారీగా వ్యవహరించేలా చేస్తున్నాయి. అయితే కొంతమంది ఇది చట్టబద్ధంగా పని చేస్తున్న ఎన్జీవోలపై ఒత్తిడి పెంచుతుందని వాదిస్తున్నారు. మొత్తం మీద మోదీ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయాలు దేశ భద్రత, మత సామరస్యం, పారదర్శకత అనే మూడు అంశాల విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper