ఏపీ సీఎం జగన్ ఎప్పుడూ సభలు, సమీక్షలు, పాలన అంటూ బిజీగా గడుపుతారు. అసలు తీరిక టైం ఉండనే ఉండదు.. కానీ ఉత్సాహం ఈరోజు అన్ని మరిచిపోయి కాస్త సేదతీరారు. గ్రౌండ్ లో బ్యాటింగ్ చేసి అలరించారు. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ లా జగన్ బ్యాటింగ్ తీరు సాగడం గమనార్హం.
వైఎస్ జయంతి సందర్భంగా రెండు రోజుల పాటు కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాడు. వాటిని ఓపెన్ చేస్తూ.. కొత్త వాటికి శంకుస్థాపన చేస్తూ జిల్లాల పర్యటన కొనసాగిస్తున్నాడు.
తాజాగా కడపలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో రూ.4 కోట్ల వ్యయంతో ఫ్లడ్ లైట్లను సీఎం జగన్ ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్టేడియం సిబ్బంది కోరిక మేరకు కాసేపు బ్యాటింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
అప్పుడెప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు జగన్ బ్యాట్ పట్టి ఉంటారు. కానీ ఇప్పుడు ప్రొఫెషనల్ క్రికెటర్ లా బ్యాట్ పట్టి బంతులను బలంగా బాదేశాడు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి బౌలింగ్ చేయగా.. సీఎం జగన్ బ్యాటింగ్ చేశాడు.
సీఎం జగన్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆశ్చర్యపోయి చూస్తూ కనిపించారు. బ్యాట్ పడుతాడో లేదో అనుకుంటే బౌండరీలు తరలిస్తున్న జగన్ ను చూసి షాక్ అయ్యారు.