Cheteshwar Pujara : క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు శాశ్వత వీడ్కోలు పలుకుతున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా పూజార ప్రకటించడం ఒకరకంగా సంచలనం సృష్టించింది. అయితే కొంతమంది ప్లేయర్లు మాత్రం పూజార నిర్ణయాన్ని పెద్ద వింతగా చూడలేదు. ఆశ్చర్యంగా భావించలేదు. ఎందుకంటే 37 సంవత్సరాల పూజారి సాధ్యమైనంతవరకు జట్టు కోసం ఆడాడు. దేశం కోసం ఆడాడు. గాయాలను ఎదుర్కొన్నాడు. శరీరాన్ని ఫణంగా పెట్టి పరుగులు తీశాడు. అయినప్పటికీ అతడు ఇబ్బంది పడలేదు. కానీ ఎప్పుడైతే అవకాశాలు రావడం తగ్గిపోయాయో అప్పుడే అతడు డిసైడ్ అయ్యాడు. కాకపోతే వెంటనే తన నిర్ణయాన్ని వెల్లడించకుండా.. ముందుగా వ్యాఖ్యాతగా మారాడు. ఆ తర్వాత క్రికెట్ నుంచి ఒక ఆటగాడిగా తప్పుకుంటున్నట్టు తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
2010లో టీమ్ ఇండియాలోకి పూజార ఎంట్రీ ఇచ్చాడు. 103 టెస్టులు ఆడాడు. 5 వన్డేలలో తలపడ్డాడు. 43.607తో 7195 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్వదేశంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో అతడు 3839 పరుగులు చేశాడు. ఇతడి సగటు 52.58. దశాబ్ద కాలంగా భారతదేశ టెస్టు జట్టులో నెంబర్ మూడవ స్థానంలో తిరుగులేని ఆటగాడిగా ఆవిర్భవించాడు. 2023లో ఓవల్ లో ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో ఆడాడు. జాతీయ జట్టులోకి రాకపోవడంతో సౌరాష్ట్ర తరఫున పూజార తన రెడ్ బాల్ క్రికెట్ ను కొనసాగించాడు. కౌంటీ ఛాంపియన్షిప్ లో ససెక్స్ తరఫున ఆడాడు.
2012లో ఆగస్టు నెలలో హైదరాబాదులో న్యూజిలాండ్ జట్టు తో జరిగిన మ్యాచ్లో పూజార తన తొలి టెస్ట్ సెంచరీ సాధించాడు.. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో తన తొలి డబుల్ సెంచరీ సాధించాడు. వాంఖడే మైదానంలో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేశాడు. 2013లో జోహెన్నస్ బర్గ్ లో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు రెండవ ఇన్నింగ్స్ లో 153 పరుగులు చేశాడు. అతడు వీరోచితమైన బ్యాటింగ్ వల్ల ఆ మ్యాచ్ డ్రా అయింది. ఆ మ్యాచ్ కోసం అతడు 6 గంటల సేపు బ్యాటింగ్ చేశాడు.. 2015లో కొలంబోలో శ్రీలంక జట్టు జరిగిన మ్యాచ్లో అతడు 145 పరుగులు చేశాడు. 2018 లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అజేయంగా 132 రన్స్ చేశాడు.. రాంచీలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఎక్కువసేపు బ్యాటింగ్ చేశాడు. 672 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసిన అతడు 525 బంతులు ఎదుర్కొన్నాడు. తద్వారా డబ్బులు సెంచరీ సాధించాడు. టెస్టులలో ఐదు రోజులు బ్యాటింగ్ చేసిన ముగ్గురు ఇండియన్ ప్లేయర్లలో పూజార ఒకడు. అతని కంటే ముందు ఎం ఎల్ జై సింహ, రవి శాస్త్రి ఉన్నారు.
ఆస్ట్రేలియాలో భారత్ వరసగా టెస్టు సిరీస్ విజయాలు సాధించడంలో పూజార కీలక పాత్ర పోషించాడు. 2018 – 19 కాలంలో అడిలైడ్, మెల్బోర్న్, సిడ్నీ ప్రాంతాలలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో అతడు మూడు సెంచరీలు సాధించాడు. భారత జట్టుకు చారిత్రాత్మకమైన టెస్ట్ సిరీస్ చేయాలి అందించాడు..జోష్ హేజిల్ వుడ్, కమిన్స్, స్టార్క్ వంటి బౌలర్లను అతడు దీటుగా ఎదుర్కొన్నాడు. నాలుగు టెస్టులలో 928 బంతులు ఆడి సరికొత్త రికార్డు సృష్టించాడు. ముఖ్యంగా బ్రిస్బెన్ లో 211 బంతులు ఎదుర్కొని 56 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు.. ఆస్ట్రేలియా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. పూజార వల్ల స్వదేశంలో ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లు కోల్పోయింది. ఇప్పటికీ పూజార అంటే ఆస్ట్రేలియా బౌలర్లు సుస్సు పోసుకుంటారు.