ఆంధ్రప్రదేశ్‌పవన్ పై విమర్శలా.. వైసీపీని ఉతికారేసిన విష్ణు

పవన్ పై విమర్శలా.. వైసీపీని ఉతికారేసిన విష్ణు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో తిరుగుతున్నారని వైసీపీ మంత్రులు, నేతల విమర్శలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తిరుపతి లో మీడియా సమావేశంలో నిర్వహించిన విష్ణు వైసీపీ నేతల మాటలకు కౌంటర్లు ఇచ్చారు. బీజేపీ- జనసేన కవాతు చూసి వైకాపా మంత్రులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. వైసీపీ మంత్రులు పిరికిపందల్లా కనపడుతున్నారని మండిపడ్డారు. కొడాలి నాని, పేర్ని నాని మంత్రులుగా అసలు పనికిరారని.. మంత్రులు సీఎం జగన్ ఇంటి పని మనుషుల్లా చేస్తున్నారని విష్ణు ఫైర్ అయ్యారు.

పవన్ కల్యాణ్, సునీల్ దేవ్ ధర్ లను ఏక వచనంతో విమర్శిస్తున్నారని.. పవన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే దమ్ముందా? అని విష్ణు ప్రశ్నించారు. పవన్ ప్రత్యేక విమానం లో తిరుగుతున్నారు అని విమర్శిస్తున్నారని.. సీఎం జగన్ సైకిల్ మీద తిరుగుతున్నారా? అని కౌంటర్ ఇచ్చారు. ప్రజల సొమ్ము తో సీఎం ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని.. పవన్ సొంత ఖర్చుతో పయనిస్తున్నారని విష్ణు చెప్పుకొచ్చారు.

ప్రధాని మోదీ, అమిత్ షా లకు ఎర్రచందనం స్మగ్లింగ్ తో సంబంధం ఉందని మాట్లాడారని.. విమర్శించే వాళ్ళు కళ్ళు కనపడని, చెవులు వినపడని ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని విష్ణు మండిపడ్డారు.

తిరుపతి భాజపా లో ఎదుర్కోవటానికి 10మంది మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు మకాం వేశారని.. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని.. ఓటుకి 2వేల రూపాయలు పంచాలని నిర్ణయం సిగ్గుచేటు అని విష్ణు ఫైర్ అయ్యారు. మీ బినామీని తీసుకొచ్చి గ్లాస్ గుర్తు తెప్పించుకున్నారని మండిపడ్డారు.

రామతీర్థం, అంతిర్వేది ఘటనల్లో హోంమంత్రి అసమర్ధత ను మీరే చెప్పుకుంటున్నారా అని విష్ణు నిలదీశారు. బీజేపీ ఆందోళన చేశాకే దేవాలయాల్లో సీసీ కెమెరాలు వచ్చాయని విష్ణు తెలిపారు. బీజేపీ నేతలు విగ్రహాలు కూల్చితే కేసులు పెట్టండని.. లేదంటే హోం మంత్రిని రాజీనామా చేయమనండని విష్ణు సవాల్ చేశారు. నిజంగా వైసీపీ నేతలకు దమ్ముంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేయండని కౌంటర్ ఇచ్చారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Himalayan Disaster

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...
Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Tollywood Directors

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Jana Nayagan

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
PNB Recruitment 2026

PNB Recruitment 2026: 545 ఉద్యోగాలు.. స్థిరమైన కెరీర్‌కు అవకాశం.. త్వరపడండి

PNB Recruitment 2026: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఇటీవల 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ (ఎల్‌వోబీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇది డిగ్రీ పూర్తి చేసి, బ్యాంకింగ్‌ రంగంలో కనీసం ఒక...
Oktelugu Epaper