Homeజాతీయ వార్తలుMinister Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రలో జితేందర్ రెడ్డి, డీకే అరుణ...

Minister Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రలో జితేందర్ రెడ్డి, డీకే అరుణ పేర్లు తెరపైకి? అసలు కథేంటి?

Minister Srinivas Goud:  తెలంగాణ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హ‌త్య‌కు కుట్ర జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు పోలీసులకు దొరికిన ఆధారాల‌తో ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు శ్రీ‌నివాస్ గౌడ్ ను హ‌త్య చేసేందుకు ఢిల్లీ కేంద్రంగా కుట్ర జ‌రిగిన‌ట్లు స‌మాచారం. దీనిపై బీజేపీ నేత‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి హ‌స్తం ఉన్న‌ట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇందులో మ‌రో మ‌హిళా నేత, బీజేపీ నాయ‌కురాలు డీకే అరుణ ప్ర‌మేయం ఉన్న‌ట్లు వార్త‌లు రావ‌డం తెలిసిందే.

Minister Srinivas Goud
Minister Srinivas Goud

దీంతో జితేంద‌ర్ రెడ్డి, డీకే అరుణ పాత్ర‌ల‌పై సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌నర్ స్టీఫెన్ ర‌వీంద్ర నేతృత్వంలో ద‌ర్యాప్తు ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. ఇందులో ఇంకా ఎవ‌రి పాత్ర ఉంద‌నే విష‌యంపై క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు. అయితే ఈ కేసులో నిందితులుగా గుర్తించిన వారు ఢిల్లీలోని జితేంద‌ర్ రెడ్డి ఇంట్లో ఉండ‌టంతో అనుమానాల‌కు తావిస్తోంది. ఇందులో ఎవ‌రి ప్ర‌మేయం ఎంత ఉంది అనే దానిపై ప‌లు కోణాల్లో ద‌ర్యాప్తు సాగుతోంది.

Also Read:  కేసీఆర్ ఢిల్లీ టూర్.. టీఆర్ఎస్ ప్రచార ఆర్భాటం

శ్రీ‌నివాస్ గౌడ్ హ‌త్య‌కు 8 మంది ప్ర‌ణాళిక ర‌చించిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో న‌లుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు త‌ర‌లించిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు. వారి ద్వారా అన్ని విష‌యాలు తెలుసుకుని మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకుంటామ‌ని పోలీసులు వెల్ల‌డిస్తున్నారు,. దీంతో శ్రీ‌నివాస్ గౌడ్ హ‌త్య‌కు కుట్ర చేసిన సంద‌ర్భంలో రాజ‌కీయ వైష‌మ్యాలు పెరిగే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

Minister Srinivas Goud
Minister Srinivas Goud

 

కేసులో మ‌రో నేత డీకే అరుణ పాత్ర ఉంద‌ని పుకార్లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆమె విలేక‌రుల స‌మావేశంలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌కెవ‌రిని చంపాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. ద‌ర్యాప్తు చేయించి నిజానిజాలు తెలుసుకోవాల‌ని సూచించారు. శ్రీ‌నివాస్ గౌడ్ అరాచకాలు అంద‌రికి తెలుసన్నారు. కానీ త‌న‌కు ఆయ‌న‌ను హ‌త్య చేయాల్సిన అవ‌స‌రం ఏమిట‌ని ప్ర‌శ్నించారు.లేనిపోని ఆరోప‌ణ‌లు స‌రైన‌వి కాద‌ని పేర్కొన్నారు.

దీంతో రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయి. ఇటీవ‌ల హ‌త్య‌ల విష‌యాలు వెలుగులోకి వ‌స్తుండ‌టంతో రాజ‌కీయ నేత‌ల్లో భ‌యం ప‌ట్టుకుంది. దీనిపై ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేసి నిజానిజాలు వెలికి తీసి త‌గిన ఆధారాల‌తో నిందితుల‌ను ప‌ట్టుకోవాల‌ని పోలీసులు ముందుకు వెళ్తున్నారు. మొత్తానికి ఇందులో ఇంకా ఎవ‌రెవ‌రి పాత్ర‌లు ఉన్నాయో వెలుగు చూసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Also Read:  ఉక్రెయిన్ -రష్యా వార్.. అభాసుపాలవుతున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper