Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Postponed: విష్వక్ శెన్ : యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా రాబోతుంది. కాగా మార్చి 4న విడుదల కావాల్సిన అశోకవనంలో అర్జున కల్యాణం చిత్రం వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ విభిన్నంగా, వినోదాత్మకంగా తెలిపారు. ‘అల్లం అర్జున్ కుమార్ జాతక రీత్యా మార్చి 4న పెళ్లి ముహూర్తం సరికాదని జ్యోతిష్యులు తీర్మానించారు. కావున కొత్త విడుదల తేదిని త్వరలో ప్రకటిస్తాం’ అంటూ ఒక ప్రకటనను రిలీజ్ చేశారు.

కాగా విలేజ్ బ్యాక్ డ్రాప్ పెళ్లి నేపథ్య కథతో బాపినీడు – సుధీర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. లేటు వయసులో పెళ్లి చేసుకోబోతున్న హీరో.. ఆ పెళ్లి అవుతుందా లేదా అనే టెన్షన్ లో పడే పాట్లు.. ఇలా సాగుతుంది ఈ సినిమా. ఈ సినిమాతో, విద్యాసాగర్ చింత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నాయికగా రుక్సార్ థిల్లాన్ నటించింది.
Also Read: సర్ ప్రైజ్ కి ‘కేజీఎఫ్ 2’ రెడీ.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు
అయితే ఈ సినిమా టీమ్ ప్రస్తుతం ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ మరియు టీజర్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ ‘అశోకవనంలో అర్జున కల్యాణం ‘సినిమా నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇక హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా కరోనా వ్యాధికి గురై.. కోలుకున్నాడు.

ఈ సినిమా పైనే తన హోప్స్ అన్నీ పెట్టుకున్నాడు. లాస్ట్ సినిమా పాగల్ కూడా భారీ ప్లాప్ అయింది. దాంతో విశ్వక్ సేన్ కి ఈ సినిమానే కీలకం అయింది. మరి విశ్వక్ సేన్ ఈ సినిమాతో హిట్ కొడతాడా ? సినిమాలో మ్యాటర్ మాత్రం చాలామందికి కనెక్ట్ అయ్యేలా ఉంది. కాబట్టి.. ఈ సినిమా హిట్ అవుతుందని ఆశిద్దాం.
Also Read: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్