Comedian Prudhuvi: థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ప్రస్తుతం కష్టాల్లో ఉన్నాడు. సినిమా పరిశ్రమలో ఎటు కాకుండా పోయాడు. అటు రాజకీయాల్లో ఉండలేక ఇటు సినిమాల్లో అవకాశాల్లేకపోవడంతో ఒంటరివాడయ్యాడు. సీఎం జగన్ అండ చూసుకుని రెచ్చిపోయి మరీ తన స్థాయికి మించి విమర్శలు చేసి ప్రస్తుతం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు. కానీ ఏం లాభం చెరువులో నీళ్లు పోయినాక ఏం లాభం అన్నట్లు ప్రస్తుతం పృథ్వీ రెంటికి చెడ్డ రేవడిగా మారాడు.

జగన్ అండ చూసుకుని రెచ్చిపోయాడు. మంద బలం చూసుకుని కుక్క మొరిగినట్లు జగన్ తన వెనకున్నాడనే ఉద్దేశంతో అందరిని చెడామడా తిట్టేశాడు. ఫలితంగా ఎటు కాకుండా పోతున్నాడు. సినిమాల్లో కూడా ఆఫర్లు రావడం లేదు. రోజుకు లకారంలో సంపాదించే పృధ్వీ ప్రస్తుతం ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ఎవరు తోడుకున్న గోతిలో వారే పడతారనేది సత్యం. ఈ క్రమంలో పృధ్వీ భవితవ్యం ఏమిటనేది ఆయనకే అర్థం కావడం లేదు.

ప్రస్తుతం జగన్ ను వీడి పవన్ కల్యాణ్ ను చేరుకోవాలని చూస్తున్నా అది కూడా కుదరడం లేదు. ఇక చేసేది లేక పవన్ కల్యాణ్ మెప్పు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నా ఆయన మాటలు నమ్మే స్థితిలో పవన్ లేనట్లు తెలుస్తోంది. ఒక దశలో జగన్ కంటే పవన్ కల్యాణే నయం అని పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నా పృధ్వీని నమ్మే పరిస్థితిలో ఎవరు లేరనేది సత్యం. దీంతో పృధ్వీ భవిష్యత్ అడకత్తెరలో చిక్కుకున్న పోకచెక్కలా మారింది. అందరు దూరం కొట్టడంతో ఇక చేసేది లేక ఒంటరిగానే మనుగడ కొనసాగించే పరిస్థితి ఏర్పడింది. జగన్ పై పెరుగుతున్న కోపంతో పవన్ కల్యాణ్ పై ప్రేమగా మారుతోందనే వాదన కూడా వస్తోంది. కానీ పృధ్వీ మాటలు పవన్ నమ్మే పరిస్థితిలో లేనట్లు తెలుస్తోంది.

ఎన్నికలకు ముందు పృధ్వీ అందరిని దుర్భాషలాడాడు. ఎంత స్థాయిలో ఉన్న వారినైనా చూసీ చూడకుండానే తనదైన శైలిలో విమర్శలు చేసి ప్రస్తుతం కష్టాల్లో పడిపోయాడు. రాబోయే రోజుల్లో వచ్చే ఇబ్బందుల దృష్ట్యా ఏం నిర్ణయం తీసుకోవాలో కూడా ఆయనకు అర్థం కావడం లేదని తెలుస్తోంది. ఈ సందర్భంలో పృధ్వీకి ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా రావడం లేదు. అటు సినిమాలకు ఇటు రాజకీయాలకు ఒకేసారి దూరమయ్యాడు. దీంతో ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదు. అందుకే అన్నారు అలుసు తొక్కనేలా కాలు కడగనేలా అని.
Also Read: Janhvi kapoor- NTR: ఎన్టీఆర్ సినిమాతోనే శ్రీదేవి కూతురు టాలీవుడ్ ఎంట్రీ
Recommended Videos