Homeజాతీయ వార్తలుCockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం ఏంటి.. ఇప్పుడు ఇవే చర్చలు సాగుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన విరమించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత సంబరాలు జరుపుకుంది. ఇక్కడితోనే జనతా పార్టీ ఆగదు. ఎందుకంటే త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరించబోతోంది. ఇదే విషయాన్ని సి జె పి […]

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం ఏంటి.. ఇప్పుడు ఇవే చర్చలు సాగుతున్నాయి.

కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన విరమించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత సంబరాలు జరుపుకుంది. ఇక్కడితోనే జనతా పార్టీ ఆగదు. ఎందుకంటే త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరించబోతోంది. ఇదే విషయాన్ని సి జె పి ప్రతినిధి అశుతోష్ రాంకా వెల్లడించారు. యువత తమ గొంతును గట్టిగా వినిపించడానికి సిజెపి ఒక వేదికలాగా ఉంటుందని ఆయన ప్రకటించారు. అంతేకాదు దానిని మరింత బలోపేతం చేస్తామని ఆయన వివరించారు. దీనికోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు..”యువత గట్టిగా మాట్లాడింది. సమస్య మీద పోరాటం సాగించింది. అనుకున్నది సాధించింది. దీని ద్వారా ఎప్పుడు కూడా నో అని చెప్పకూడదని అర్థమైందని” రాంకా వెల్లడించారు.

దీన్ని బట్టి బొద్దింకలు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతున్నాయని అర్థమవుతోంది. అయితే ఇక్కడితోనే బొద్దింకలు ఆగిపోయే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే బొద్దింకల తదుపరి లక్ష్యం వేరే విధంగా ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే దేశంలో నిరాశ.. నిస్పృహలకు ఎక్కువగా గురవుతోంది యువతే. అందువల్లే ఉద్యోగం
.. ఉపాధి అవకాశాల కోసం బొద్దింకలు ఉద్యమం చేపట్టే అవకాశం కనిపిస్తోంది.

వాస్తవానికి నీట్ పేపర్ లీకేజీ కంటే ముందు యువతను ఉద్దేశించి సీజేఐ బొద్దింకలని వ్యాఖ్యానించారు. దానినించే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. అప్పుడే ఉద్యోగం.. ఉపాధి అవకాశాల గురించి వారి నోటి వెంట డిమాండ్ వచ్చింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడంతో ప్రస్తుతానికైతే బొద్దింకలు తమ ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నాయి. ఇక మిగతా అంశాల మీద భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నాయి. ఇదే విషయాన్ని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ తాజాగా ప్రకటించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు అయ్యేదాకా చూస్తామని.. అదే ఇప్పుడు తమ ముందు ఉన్న పెద్ద పని అని దాస్ వెల్లడించారు.

వాస్తవానికి నీట్ విద్యార్థులు మాత్రమే కాదు.. ఇటీవల జరిగిన ఉద్యమంలో చాలామంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో రకరకాల వర్గాలకు చెందిన వారున్నారు. అక్రమాలకు చెక్ పెట్టాలి. ఉద్యోగాలను భర్తీ చేయాలి.. నియామక పరీక్షలను సక్రమంగా నిర్వహించాలి. పారదర్శకత కొనసాగించాలని ఇటీవల జరిగిన ఉద్యమంలో విద్యార్థులు డిమాండ్ చేశారు. తదుపరి లక్ష్యం దీని దిశగానే సాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు బొద్దింకలకు సంస్థ గత నిర్మాణం అంటూ లేదు. కేవలం సోషల్ మీడియా వేదిక ద్వారానే అది వ్యవహారాలు సాగిస్తోంది. ఇకపై పోరాటాలను ఇదే స్థాయిలో నిర్వహించగలుగుతుందా.. యువతను ఆకర్షించగలుగుతుందా.. ఈ స్థాయిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలుగుతుందా.. అనేది చూడాల్సి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper