Homeఆంధ్రప్రదేశ్‌Chikoti Praveen: చికోటి ప్రవీణ్ ఆ హీరోయిన్లను వాడుకున్నాడా?

Chikoti Praveen: చికోటి ప్రవీణ్ ఆ హీరోయిన్లను వాడుకున్నాడా?

Chikoti Praveen: చికోటి ప్రవీణ్ నిర్వహించిన క్యాసినో వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. అతడి లాప్టాప్, డైరీ తెరిచి చూస్తున్న అధికారులకు విస్తు పోయే వాస్తవాలు కళ్ళకు కడుతున్నాయి. క్యాసినో వ్యవహారంలో ఆరి తేరిన ప్రవీణ్.. తన వ్యాపార అభివృద్ధికి ఏకంగా సినీ తారలను ఉపయోగించుకున్నాడు. బాలీవుడ్ ఐటం బాంబ్ మల్లికా శెరావత్, తెలుగు నటిమణులు డింపుల్ హయాతీ, ఇషా రెబ్బా తో తన క్యాసినోకు ప్రచారం చేయించుకున్నాడు.ఇందు కోసం వారికి భారీగానే ముట్ట చెప్పాడు. పైగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు ఈ నటీమణులతో కలిసి విందులు, అంతకుమించి సౌలభ్యాలు ఏర్పాటు చేశాడని ఈడీ వర్గాలు అంటున్నాయి.

Chikoti Praveen
Chikoti Praveen

చేతికి మట్టి అంటకుండా

మొదటి నుంచి చీకటి వ్యాపారాలకు అలవాటు పడిన ప్రవీణ్ కుమార్ నెరిపిన ప్రతి వ్యవహారంలోనూ మట్టి అంటకుండా చూసుకునేవాడు. గోవాలోని బిగ్ డాడీ కేసనో హౌస్ తో సత్సంబంధాలు ఉన్న ప్రవీణ్ కుమార్.. దాని ద్వారానే నేపాల్, శ్రీలంకలో జూదాలు నిర్వహించాడు. ఆర్థిక మాంద్యంతో విలవిలలాడుతున్న శ్రీలంకలో సైతం జూదాలు నిర్వహించాడంటే ప్రవీణ్ కు ఉన్న పరపతిని అర్థం చేసుకోవచ్చు. పైగా ప్రవీణ్ కుమార్ జరిపిన చెల్లింపుల్లో డిసిసిబి బ్యాంకు ఖాతాలను వినియోగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందుకోసం తెలంగాణలోని పలు డిసిసిబి చైర్మన్ లను మచ్చిక చేసుకున్నాడని వినికిడి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓ జిల్లా డిసిసిబి చైర్మన్ వద్దకు బాలీవుడ్ ఐటమ్ గర్ల్ ను పంపాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. పైగా ఈ విషయం అతని ఇంట్లో తెలియడంతో కుటుంబ కలహాలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివాదాస్పద రాజకీయ నేతగా పేరిందిన ఓ నాయకుడి చిట్ ఫండ్ సంస్థ ద్వారా హవాలా మార్గంలో లావాదేవీలు నడిపించాడని సమాచారం.

Also Read: Congress Focus on Munugodu: మునుగోడు సిట్టింగ్ సీటుపై కాంగ్రెస్ ఫోకస్.. డిఫెన్స్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Chikoti Praveen
Chikoti Praveen

దాన్ని పసిగట్టిన ఈడి వర్గాలు ప్రస్తుతం ఆ రాజకీయ నాయకుడిని హైదరాబాదులో ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం మల్లికా శెరావత్, ఈషా రెబ్బ, డింపుల్ హయాతి మాత్రమే కాకుండా టాలీవుడ్ లోని పేరొందిన నటీమణులు కూడా ఈయన జాబితాలో ఉన్నారు. పైగా తెలంగాణలోని పలువురు మంత్రులు, కీలక శాఖలకు చెందిన అధికారులు ఈయన నడిపిన జూదాల్లో పాల్గొన్నారని వినికిడి. ప్రస్తుతం చికోటి ప్రవీణ్ వ్యవహారం ఒకప్పటి నయీం దందాలను తలపిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో నేరుగా ఈడి అధికారులే రంగ ప్రవేశం చేయడంతో తెలంగాణ పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. ప్రవీణ్ తో టిఆర్ఎస్ నేతలు అంట కాగడంతో అధికార పార్టీ మౌనాన్ని ఆశ్రయిస్తోంది. ఇంత జరుగుతున్నా అధికార పత్రికలో ఒక సింగిల్ కాలం వార్త కూడా ప్రచురణకు నోచుకోకుంది. ప్రస్తుతం ప్రవీణ్ చెప్పిన విషయాల ఆధారంగా టిఆర్ఎస్ లోని ముఖ్య నేతల మెడపై ఉచ్చు బిగించాలని కేంద్రం భావిస్తోంది. టిఆర్ఎస్, బిజెపి మధ్య ఉప్పు నిప్పులా వాతావరణం ఉండడంతో.. మున్ముందు ఈ పరిణమాలకు దారి తీస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Also Read:KA Paul: తెలంగాణ సీఎంగా నేను.. ఏపీ సీఎంగా మహిళా నేత…కేఏ పాల్ మళ్లీ ఏశాడు

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular