America Secret Weapons: అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీని అమెరికా హతమార్చిన తీరు ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. ప్రపంచంలో అత్యంత కరుడుగట్టిన ఉగ్రావాదుల్లో ఒకరైన జవహరీని పేలుళ్లు లేకుండా.. ఇంట్లోనే.. కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరుగకుండా.. అమెరికా చాకచక్యంగా చంపేసింది. ఇందుకు అత్యాధునిక ఆయుధం హెల్‌ఫైర్ ఆర్9ఎక్స్ క్షిపిణిని ఉపయోగించింది. దీనిని అమెరికా అంత్యంత రహస్య ఆయుధంగా చెబుతున్నారు. జవహరీ ఇంటిపై రెండు మిసైల్స్‌తో దాడి జరిగిప్పటికీ బయటికి మాత్రం పేలుడుకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడం లేదు.

భయంకరమైన ఆయుధం హెల్‌ఫైర్ ఆర్9ఎక్స్..
అల్ జవహరీని అంతమొందించేందుకు అమెరికా ఉపయోగించిన హెల్‌ఫైర్ ఆర్9ఎక్స్ అత్యంత భయకరమైన ఆయుధంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఎలాంటి పేలుడు లేకుండా లక్ష్యంవైపు దూసుకెళ్లి పని పూర్తి చేయడం దీని ప్రత్యేకతగా చెబుతున్నారు. ఈ ఆయుధాన్ని అమెరికా 2017 మార్చిలో మొదటి సారి ప్రయోగించింది. ఆల్ ఖైదా సీనియర్ లీడర్ అబు అల్ ఖాయర్ అల్ మస్రీ.. సిరియాలో కారులో ప్రయాణిస్తుండగా డ్రోన్ ద్వారా హెల్‌ఫైర్ ఆర్9ఎక్‌ను ప్రయోగించి హతమార్చింది. యెమెన్‌లో 17 మంది అమెరికా నావికుల మరణానికి కారణమైన జమాల్ అల్ బడావీ అనే ఉగ్రవాదిని మట్టుపెట్టేందుకు 2019 జనవరిలో హెల్‌ఫైర్ ఆర్9ఎక్స్‌ను ప్రయోగించారు. సిరియాలో అల్‌ఖైదాతో సంబంధం ఉన్న ఉగ్రవాద శిక్షకుడిని చంపేందుఉ 2020లోనూ ఈ ఆయుధాన్ని అమెరికా వాడింది. 2020లోనే ఇరాన్ సైనిక ప్రముఖుడు జనరల్ ఖాసి సోలెమనీని చంపేందుకు కూడా అమెరికా హెల్‌ఫైర్ ఆర్9ఎక్స్ ఆయుధం వాడింది.
Also Read: Nancy Pelosi Taiwan Visit: చిచ్చుపెట్టిన అమెరికా.. తైవాన్ పై చైనా యుద్ధం చేయబోతుందా?
విధ్వంసం లేకుండా…
అబు అల్‌పై ప్రయోగించినప్పుడు కారు రూఫ్‌పై పెద్ద రంద్రం కనిపించింది. కారు లోపల కొన్ని ఇంటీరియర్ పరికరాలు ధ్వంసమైనప్పటికీ కారు ముందు భాగం, వెనుక భాగం చెక్కచెదరలేదు. ప్రస్తుతం జవహర్ ఇంటిపై జరిగిన దాడిలో కూడా అలాంటి పరిస్థితే కనిపించింది. రెండు మిసైల్స్ ప్రయోగం జరిగినప్పటికీ దాడి జరిగిన పరిసరాల్లో పేలుడు సంభవించలేదు. జవహరీ బాల్కనీలో ఉండగా యూఎస్ ఆర్మీ డ్రోన్ దాడి చేసి అతడిని హతమార్చిందని అమెరికాకు చెందిన ఒక ఉన్నత అధికారి ప్రకటించారు. అయితే ఈ సమయంలో జవహరి కుటుంబ సభ్యులు ఇంట్లనే ఉన్నప్పటికీ వారెవరూ గాయపడలేదు.

అమ్ములపొదిలో మరిన్ని..
అమెరికా అమ్ముల పొదిలో ఏజీఎం–114 హెల్‌ఫైర్ అనే లేజర్ గైడ్ క్షిపుణులు ఉన్నాయి. వీటిని గగనతలం నుంచి భూతలంపైకి ప్రయోగిస్తారు. ధ్వనికంటే తక్కువ వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. వార్‌హెడ్, మార్గనిర్దేశక వ్యవస్థ భౌతిక పరిస్థితుల ఆధారంగా ఏజీఎం– 114 హెల్‌పైర్‌లో అనేక రకాలు కూడా అమెరికా వద్ద ఉన్నాయి. వీటిలో హెల్‌ఫైర్ ఆర్9ఎక్స్ ది ప్రత్యేక స్థానం. ఈరకం క్షిపుణులను ఒబామా హయాంలోనే తయారు చేశారు. కరుడుగట్టిన ఉగ్రవాదులను ఒంటరిగా హతమార్చేందుకు అమెరికా వీటిని ఉపయోగిస్తోంది.
బ్లేడ్లే ఛిద్రం చేస్తాయి..
హెల్‌ఫైర్ ఆర్9ఎక్స్‌లో వార్‌హెడ్ ఉండదు. ఈ కారణంగా దీనిని ప్రయోగించినప్పుడు పేలుడు జరుగదు. క్షిపిణి ప్రధాన భాగానికి అనుసంధానం చేసిన పదునైన ఆరు బ్లేడ్లు ఉంటాయి. లక్ష్యానికి దగ్గరగా వెళ్లగానే ఈ బ్లేడ్లు విడుదలవుతాయి. అవి టార్గెట్‌ను ఛిద్రం చేస్తాయి. డ్రోన్లు, విమానాలు, హెలిక్యాప్టర్లు, హమ్వీ వాహనాల ద్వారా ఈ క్షిపిణిని ప్రయోగించవచ్చు. 500 మీటర్ల నుంచి 11 కిలోమీటర్లలోపు లక్ష్యాలను ఇది ఛేదిస్తుంది.
Also Read:America- al Qaeda Leader Zawahiri: అమెరికా అన్నంత పని చేసింది
[…] Also Read: America Secret Weapons: అమెరికా అమ్ముల పొదిలో రహస్య … […]