spot_img
Homeఆంధ్రప్రదేశ్‌నేను సీఎంగా ఉంటే కథ వేరుండేదంటున్న చంద్రబాబు!

నేను సీఎంగా ఉంటే కథ వేరుండేదంటున్న చంద్రబాబు!

Chandrababu Naidu

‘నా చేతికి స్టీరింగ్ ఇవ్వండి.. బండి ఎలా వేగంగా నడపాలో చూపిస్తాను’ అని అంటుంటారు కారు లేని మిత్రులు. ఇప్పుడు సేమ్‌ టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి అలానే తయారైంది. చంద్రబాబు తెరమీదకు వచ్చి యుద్ధం చేయాలని ప్రజలు కోరుకుంటుంటే.. ఆయన మాత్రం ప్రజల్లోకి రాకుండా పోరాడుతానంటున్నారు.

Also Read: తెలంగాణను వదిలి.. ఏపీపైనే విమర్శలు?

‘ఈ జగన్ సీఎంగా ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాడు.. అదే నేను అయితేనా ఇలా చేసేవాడినా.. ఉరుకులు పరుగులు పెట్టించేవాడిని.. నేను సీఎంగా ఉంటేనా ఆ కథే వేరు’ అంటూ ఫ్లాష్ బ్యాక్ రీల్స్ తిప్పుకుంటున్నారు. కానీ.. చంద్రబాబు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని మరిచినట్లున్నారు పాపం. వరద సహాయ చర్యలు ఇలాగేనా చేసేది అంటూ బురద రాజకీయానికి చంద్రబాబు తెరతీశారు. దీంతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందిస్తూ .. ‘మీ పాలనలో కరవు తప్ప వరదలు ఎప్పుడు వచ్చాయి..’ అని బాబును నిగ్గదీశారు. అయినా చంద్రబాబు తగ్గడంలేదు. తన అనుభవం కట్టుకథలు అల్లుతూనే ఉన్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జగన్‌ రెండో సారి తిరుమల దేవుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. మొన్న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించారు. ఇలా జగన్ అపర‌ భక్తుడిగా దేవుళ్ల, దేవతల సేవలో తరిస్తుంటే చంద్రబాబు ఆ దృశ్యాలు అసలు చూడలేకపోతున్నారట. గత నెలలో తిరుపతి పేరిట డిక్లరేషన్ అంటూ ఎంత గొడవ చేయాలో అంతా చేశారు, కానీ.. నో యూజ్. ఇక ఇప్పుడు ఏం చేయగలరు..!

Also Read: పబ్లిసిటీ కోసం కోట్ల తగలేస్తారా? ఏపీ సర్కార్‌‌ పై ప్రజల ఫైర్‌‌

జగన్‌ అధికారం చేపట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా చంద్రబాబు పేరు పలకలేదు. కానీ.. చంద్రబాబు మాత్రం ఉదయం లేవగానే జగన్‌ మీదనే విరుచుకుపడుతుంటారు. దీన్ని చూసిన తమ్ముళ్లు ఇన్ని వేల సార్లు రోజుకు ఆయన పేరు వల్లెవేసి బాబే తెగ ప్రచారం చేస్తున్నారని సెటైర్లు కూడా వేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ అని గట్టిగానే చంద్రబాబు గద్దిస్తున్నారు. కానీ జనాలకు అది అక్కసుగా అనిపిస్తోంది తప్ప ఆరోపణలా లేదు. మొత్తానికి చంద్రబాబు బాగా ఫస్ట్రేషన్ లో ఉన్నారనేది అందరికీ అర్థమవుతోంది. వాటి నుంచి ఎప్పుడు ఎలా బయటపడుతారో కాలమే నిర్ణయించాలి మరి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

India vs Zimbabwe

India vs Zimbabwe: శనిగాడు ‘గంభీర్’ లేడు.. అందుకే టీమిండియా గెలిచింది.. లక్ష్మణ్ వ్యూహం ఫలించింది

India vs Zimbabwe: కాలుకు వేస్తే మెడకు వేస్తాడు. మెడకు వేస్తే కాలుకు వేస్తాడు. బోడి గుండుకు కొండకు ముడి పెడతాడు. వెంట్రుకతో లాగాలి అంటాడు. వింత వింత నిర్ణయాలు తీసుకుంటాడు. అవి...
NEET Paper Leak

NEET Paper Leak: పేపర్ లీక్ చేసే ఊహే రాకుండా.. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ఎంత కఠినంగా ఉందో...

NEET Paper Leak: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువకులు ఏకంగా పార్లమెంటు మీదికి దూసుకుపోయారు. కేంద్ర...
Tech Mahindra Employee

Tech Mahindra Employee: ఐటీ ఉద్యోగం అంటేనే పేక మేడ.. ఎప్పుడు ఊడుతుందో ఎవరికి ఎరుక.. పాపం ఈ...

Tech Mahindra Employee: ఇన్ని రోజులపాటు చేసిన చోట ఉద్యోగం లేదంటే.. ఆ ఉద్యోగి కి ఎంత కష్టం ఉంటుంది.. హాయిగా పని చేసుకుంటూ.. బ్రహ్మాండంగా జీతం తీసుకుంటూ.. జీవితాన్ని సాగిస్తున్న ఆమెకు...
Pawan Kalyan

Pawan Kalyan: క్యాబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. కారణం ఏంటంటే..

Pawan Kalyan: సచివాలయం లో నేడు సీఎం చంద్రబాబు నాయుడు అద్వర్యం లో జరిగిన క్యాబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు అవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం...
America Politics

America Politics: అమెరికాకు యువ అధ్యక్షురాలు.. పోల్స్ తో ఈ 36 ఏళ్ల మహిళకే ఓటు

America Politics: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అయింది. నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అంతకుముందు జోబైడెన్‌ అధ్యక్షుడిగా...
Oktelugu Epaper