spot_img
Homeజాతీయ వార్తలుకరోనా.. టీకా డోసుల టార్గెట్ సాధ్యమేనా?

కరోనా.. టీకా డోసుల టార్గెట్ సాధ్యమేనా?

Covid vaccine dosesకరోనా ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. రెండు దశల్లో ప్రజలు అల్లాడిపోయారు. చాలామంది ప్రాణాలే కోల్పోయారు. నిశ్శబ్దంగా వచ్చి అలజడి చేసిన మహమ్మారితో జనం పడిన ఇబ్బందులు అంతా ఇంతా కాదు. కరోనాకు విరుగుడు టీకా అని తెలిసినా కూడా ప్రజలకు సరైన రీతిలో అందడం లేదు. దీంతో మహమ్మారి మరోమారు విజృంభించే అవకాశాలు ఉన్నాయని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. కొన్ని అవాంతరాల వల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కాలేకపోతోంది. జులై నెలలో 13.5 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటివరకు కేవలం 9.94 కోట్ల మందికి మాత్రమే టీకాలు అందినట్లు తెలుస్తోంది. ఇంకా 4 కోట్ల వ్యాక్సిన్లు వేయాల్సి ఉంది. అది నాలుగు రోజుల్లో వేయాల్సి ఉంది.

కేంద్రం విధించిన లక్ష్యం చేరుకోవాలంటే రోజుకు 60 లక్షల డోసుల టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ 21న 87 లక్షల మందికి టీకాలు ఇచ్చి రికార్డు సృష్టించారు. జూన్ 21న 18 ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశంలో 43.51 కోట్ల మందికి టీకా ఇచ్చారు. గత 24 గంటల్లో 18 లక్షల మందికి పైగా ఇచ్చారు. వీరిలో 34 కోట్ల మంది ఫస్ట్ డోసు తీసుకున్నారు. 9.3 కోట్ల మంది రెండు డోసులు తీసుకున్నారు.

జులై నెలాఖరు వరకు 50 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది. కానీ ఆ టార్గెట్ ను దాటే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటివరకు 43.51 కోట్ల డోసులు వేశారు. మిగిలిన నాలుగైదు రోజుల్లో లక్ష్యం సాధించడం అసాధ్యమే. టీకాల పంపిణీలో వేగవంతం లేకుపోవడంతోనే అనుకున్న లక్ష్యం నెరవేరే ఆశలు కనిపించడం లేదు. టీకాల విడుదలలో జాప్యాన్ని నవారించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

అమెరికా నుంచి విరాళంగా ఇవ్వనున్న మోడెర్నా ఫైజర్ టీకాల దిగుమతికి న్యాయపరమైన అవాంతరాలు తొలగిపోతే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. టీకాలు భారత్ కు సకాలంలో చేరి ఉంటే లక్ష్యసాధన సులువయ్యేది. కానీ అలా జరగకపోవడంతో ప్రభుత్వం నిర్దేశించుకన్న లక్ష్యం చేరుకోలేకపోయింది. కొవిషీల్డ్ టీకాను ఉత్పత్తి చేసే సీరం ఇన్ స్టిట్యూట్ ఆప్ ఇండియా మూడు నెలల్లో టీకా ఉత్పత్త రెట్టింపు చేసింది.

జూన్ లో 10 కోట్ల కొవిషీల్డ్ డోసులను ఉత్పత్తి చేసిన సీరం ఆగస్టులో దీన్ని 12 కోట్ల డోసులకు పెంచాలని చూస్తోంది. బయోలాజికల్ ఈ కంపెనీ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా కొర్చవ్యాక్స్ కు సెప్టెంబర్ చివరి వరకు అత్యవసర వినియోగ అనుమతి లభించే అవకాశం ఉంది. ఆగస్టు 21 నాటికి అత్యవసర అనుమతుల కోసం కంపెనీ దరఖాస్తు చేసుకోనుంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper