https://oktelugu.com/

AP government: ఏపీ సర్కారుకు కేంద్రం షాక్.. అప్పులపై ఆంక్షలు..

AP government: ఆంధప్రదేశ్ అప్పులాంధ్రప్రదేశ్‌గా మారిందని గత కొంత కాలంగా ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే, ఆ విషయాలపైన ఏపీ సర్కారు అస్సలు స్పందించలేదు. వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తూనే ముందుకు సాగింది. కొత్త అప్పులు చేస్తూనే సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే రాష్ట్రసర్కారు అప్పులు తీసుకునేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం విధించే పరిమితి కూడా దాటేసింది. దాంతో ఏపీ సర్కారుకు కేంద్రం తాజాగా షాక్ ఇచ్చింది. ఏపీ సర్కారు భవిష్యత్తులో తీసుకునే అప్పులపై ఆంక్షలు […]

Written By:
  • Mallesh
  • , Updated On : December 21, 2021 / 11:17 AM IST
    Follow us on

    AP government: ఆంధప్రదేశ్ అప్పులాంధ్రప్రదేశ్‌గా మారిందని గత కొంత కాలంగా ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే, ఆ విషయాలపైన ఏపీ సర్కారు అస్సలు స్పందించలేదు. వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తూనే ముందుకు సాగింది. కొత్త అప్పులు చేస్తూనే సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే రాష్ట్రసర్కారు అప్పులు తీసుకునేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం విధించే పరిమితి కూడా దాటేసింది. దాంతో ఏపీ సర్కారుకు కేంద్రం తాజాగా షాక్ ఇచ్చింది.

    AP government

    ఏపీ సర్కారు భవిష్యత్తులో తీసుకునే అప్పులపై ఆంక్షలు విధిస్తున్నట్లు పార్లమెంటులో ప్రకటించింది. ఏపీ సర్కారు అప్పుల విషయమై ఇటీవల వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడారు. ఏపీ సర్కారు పరిమితికి మించి తీసుకున్న అప్పులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజాగా ఈ చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయిన విభజిత ఏపీలో ఆర్థిక నిర్వహణ గాడీ తప్పింది. సంక్షేమ రాగంలో ప్రభుత్వం భారీ స్ధాయిలో అప్పులు చేసి చివరికి చిక్కులు తెచ్చి పెట్టుకుంది. పరిమితులను దాటేసిన క్రమంలో చివరికి కేంద్రమే నేరుగా జోక్యం చేసుకువాల్సిన పరిస్థితికి ఏపీ వచ్చింది.

    రెండేళ్లుగా ఏపీ సర్కారు కేంద్రం విధించే పరిమితులను దాటేసిందని, ఉల్లంఘనలు చేసిందని తేలింది. కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితులను దాటి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ సర్కారు రూ.17 వేల కోట్ల రుణాలు తీసుకుందని కేంద్రం తెలిపింది. పార్లమెంటులో విపక్ష ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్రం నుంచి ఈ విధమైన సమాధానాలు వచ్చాయి. మొత్తంగా ఏపీ ప్రభుత్వానికి గట్టి షాకే తగిలింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యలకుగాను వచ్చే మూడేళ్ల పాటు అప్పుల పరిమితుల్లో కోతలు విధిస్తామని కేంద్రం స్పష్టంగా తేల్చేసింది.

    Also Read: AP CM Jagan: జగన్ జెట్ స్పీడు.. పదవుల భర్తీ ఇంత స్పీడా?

    ఏపీకి చెందిన ఎంపీలు రఘురామకృష్ణరాజు, కేశినేని నాని అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఆర్థిక శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఇచ్చిన సమాధానాల ద్వారా వైసీపీ సర్కారు చేసిన అప్పుల వివరాలు బయటకు వచ్చాయి. కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ఏపీ సర్కారుకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం తీసుకున్న రుణాన్ని వచ్చే మూడేళ్లలో సర్దుబాటు చేసుకునే చాన్స్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇకపై ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటకుండా జాగ్రత్త పడాలని కేంద్రం ఏపీ సర్కారును హెచ్చరించింది. ఆంధప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి చాలా కాలం నుంచి ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. అయితే, ఏపీ సర్కారు అప్పులు చేస్తూనే ముందుకు సాగింది. ఫలితంగా ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి.

    Also Read: Chandrababu: ఈసారి టికెట్ల కేటాయింపు చంద్రబాబు చేతుల్లో లేదట?

    Tags