Jagan Birthday Celebrations: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుటుంబంలో అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్న వేడుకల్లో ఒకటి జగన్ జన్మదిన వేడుక అని చెప్పొచ్చు. ఇక ఈ వేడుకకు జగన్ కుటుంబ సభ్యులు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. జగన్ కూతుర్లు ఎక్కడున్నా జగన్ బర్త్ డే రోజున కంపల్సరీగా ఆయన వద్దకు వచ్చేస్తున్నారు. తండ్రి సమక్షంలో వేడుకల్లో పాల్గొంటున్నారు. గతేడాది జగన్ జన్మదిన వేడుకల్లో ఆయన తల్లి విజయమ్మ కూడా పాల్గొంది. ఇకపోతే ఈ బర్త్ డే వేడుక జగన్‌కు విశేషమైనది. ఈ బర్త్ డేతో జగన్ తన 50వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు.
ఇకపోతే వైఎస్ జగన్ బర్త్ డే వేడుకను అత్యంత ఘనంగా సెలబ్రేట్ చేసేందుకుగాను వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాస్ట్లీ గిఫ్టులు అధినేతకు అందించి ప్రసన్నం చేసుకోవాలనుకంటున్నారు. త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ ఉన్న నేపథ్యంలో మినిస్టర్ పదవి కావాలనుకున్న వారు జగన్‌కు చాలా కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అలా ఖరీదైన బహుమతులు ఇచ్చి జగన్ దృష్టిలో పడాలని నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే రూ.కోటికి తగ్గకుండా పేద్ద గిఫ్టులు ఇచ్చి జగన్ ఫిదా అయిపోయేలా ప్లాన్ చేస్తున్నారని వినికిడి.
ఇలా భారీ గిఫ్ట్‌లు జగన్‌కు అందజేసి రిటర్న్ గిఫ్ట్ కింద తమకు జగన్ నుంచి మినిస్టర్ పోస్టు రావాలని కొందరు వైసీపీ నేతలు ఆశిస్తున్నట్లు టాక్. అలా ఖరీదైన గిఫ్టులు ఇచ్చే వారిలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళా నేత, అనంతపురం డిస్ట్రిక్ట్‌కు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే, విశాఖకు చెందిన యువనేత, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ కాపు సామాజిక వర్గం నాయకుడు ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ కరుణిస్తే తాము మంత్రులు అయిపోతామని వారు భావిస్తున్నారు.
Also Read: AP CM Jagan: జగన్ జెట్ స్పీడు.. పదవుల భర్తీ ఇంత స్పీడా?
ఈ క్రమంలోనే వారు తాడేపల్లికి చేరుకుని అధినేత జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే, జగన్ మనసులో వీరి గురించి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఇంతకీ కేబినెట్ విస్తరణ ఎప్పుడు అనేది ఇంకా స్పష్టంగా తేలలేదు. ఇకపోతే వైసీపీ అధినేత జగన్ తనకు బర్త్ డే రోజున ఖరీదైన గిఫ్టులు ఇచ్చిన వారికి నిజంగానే రిటర్న్ గిఫ్టుగా మినిస్టర్ పోస్ట్ ఇస్తాడా అనేది వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. చాలా కాలం నుంచి ఏపీలో కేబినెట్ విస్తరణ గురించి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారనుంది.
Also Read: Chandrababu: ఈసారి టికెట్ల కేటాయింపు చంద్రబాబు చేతుల్లో లేదట?