Yogi Adityanath: వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరిగే అయిదు స్టేట్ల ఎన్నికల్లో సత్తా చాటేందుకు రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇందులో భాగంగా వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలను కట్టడి చేసే క్రమంలో తమ ఆలోచనలకు పదును పెడుతున్నాయి. అధికారం కోసం వాగ్దానాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయాయి. ఇందుకు గాను తమ శక్తి యుక్తులను పణంగా పెడుతున్నాయి. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని పావులు కదుపుతున్నాయి.

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల్లో ఆందోళన పెరుగుతోంది. రాష్ర్టంలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ర్టంగా గుర్తింపు పొందిన ఉత్తరప్రదేశ్ లో ఏ పార్టీకి మెజార్టీ స్థానాలు వస్తే అదే పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న విషయం తెలియడంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నాయి.
ఇందులో భాగంగా బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో వాగ్దానాల వరద పారించేందుకు రేడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు తాయిలాలు ప్రకటించిన పార్టీలు మరోమారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నాయి. దీని కోసమే పార్టీల మేనిఫెస్టోలు ఖరారు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: Modi vs TRS: టీఆర్ఎస్ ‘వరి’ కాటుకు.. మోడీ దెబ్బ మామూలుగా లేదుగా!
ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ర్టంలో కోటి మంది విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు పంపిణీ చేయాలని భావించడంతో ప్రత్యర్థి పార్టీల్లో అలజడి రేగుతోంది. మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి సందర్భంగా డిసెంబర్ 25న తొలిదశ పంపిణీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజకీయ పార్టీల్లో ఆందోళనలు కలుగుతున్నాయి. మళ్లీ బీజేపీ అధికారంలో వస్తే ఎలా అనే అనుమానాలు అన్ని పార్టీల్లో వస్తున్నాయి.
Also Read: Aadhaar Voter ID linking: ఓటరు కార్డుతో ఆధార్ లింకు.. వద్దని ప్రతిపక్షాల మంకు