spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YCP Jayaho BC Sabha : బీసీలపై జగన్ ది ప్రేమనా? లెక్కలతో కడిగేసిన బీజేపీ

YCP Jayaho BC Sabha : బీసీలపై జగన్ ది ప్రేమనా? లెక్కలతో కడిగేసిన బీజేపీ

YCP Jayaho BC Sabha : జయహో బీసీ సభ.. బీసీలే వెన్నెముక అన్న నినాదంతో విజయవాడలో వైసీపీ సర్కారు చేపట్టిన బీసీ గర్జన సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. బీసీలు ఈ సభకు పెద్దగా రాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చి వెలవెలబోయింది. ఆర్టీసీ బస్సులను దారిమళ్లించి మరీ జనాలను విజయవాడ చేర్చినా ఎవరూ ఎక్కలేదు. ప్రజా రవాణా స్తంభించినా పెడచెవిన పెట్టి ఈ పనిచేసినా బీసీల నుంచి ఆశించిన స్పందన రాలేదు.

BJP Leader parthasarathi
BJP Leader parthasarathi

కడుపు నిండా … కరువు తీరా టిఫిన్, భోజనం’తో బీసీ గర్జనను సక్సెస్ చేసేందుకు వైసీపీ సర్కారు ఆపసోపాలు పడింది. అందుకే పసందైన విందు భోజనాలను సిద్ధం చేసింది. రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న వైసీపీ శ్రేణులకు ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనం వరకూ వారు నచ్చీ..మెచ్చే ఆహారం పెట్టేందుకు భారీగానే ఖర్చు చేస్తోంది. ఇందుకుగాను ప్రత్యేక మెనూ రూపొందించింది. అయినా బీసీలు పెద్దగా రాకపోవడంతో సభ జనాలు లేక వెలవెలబోయింది.

జయహో బీసీ సభ ద్వారా ఏం ఉద్దరించారని.. బీసీలకు ఏం సాధించిపెట్టారని బీజేపీ విమర్శించింది. బీజేపీ నేత డా. పార్థసారథి ఈ మేరకు వైసీపీ తీరును తూర్పారపట్టారు. రాజకీయంగా బీసీలకు ఎన్నో అవకాశాలు ఇచ్చామంటున్న జగన్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు వైసీపీ ఇచ్చింది కేవలం 23శాతం అసెంబ్లీ సీట్లు మాత్రమే. మరి అంతెందుకు..అత్యధికంగా బీసీలున్న రాయలసీమలో కానీ.. ఉత్తరాంధ్రలో కానీ బీసీలకు వైసీపీ న్యాయం చేయలేదు. రాయలసీమలోని మొత్తం 52 అసెంబ్లీ సీట్లకు మీరు ఎంతమంది బీసీలకు ఇచ్చారంటే సమాధానం లేదు. సీఎం జగన్ సొంత జిల్లా కడప జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి కూడా బీసీలకు వైసీపీ ఇవ్వకుండా అన్యాయం చేసింది వైసీపీనే కదా అని పార్థసారథి విమర్శించారు.

2024లో 67 శాతం జనాభా ఉన్న బీసీలు ఎంత మందికి సీట్లు ఇస్తారో వైసీపీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని బీజేపీ నేత డా. పార్థసారథి విమర్శించారు. 2.15 కోట్ల బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారో సమాధానం చెప్పాల్సి ఉంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 34శాతం ఉన్న రిజర్వేషన్ ను 24 శాతానికి తగ్గించి ఎంతో మందిని బీసీలు సర్పంచ్ లు, ఎంపీటీసీలు కాకుండా అడ్డుకున్నది వైసీపీ ప్రభుత్వం అని పార్థసారథి విమర్శించారు. సలహాదారులు, నామినేటెడ్, టీటీడీలోనూ బీసీలకు మొండి చేయి చూపారని లెక్కలతో సహా కడిగేశారు పార్థసారథి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Chennai Love Story Movie Review

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...
Oktelugu Epaper