Homeజాతీయ వార్తలుAssembly Election Results 2026: వెనుకంజలో ముగ్గురు సీఎంలు..

Assembly Election Results 2026: వెనుకంజలో ముగ్గురు సీఎంలు..

Assembly Election Results 2026: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడు పశ్చిమ బెంగాల్లో గంట గంటకు పరిస్థితులు మారిపోతున్నాయి. బెంగాల్లో బిజెపి చరిత్ర సృష్టించే దిశగా సాగుతోంది. తమిళనాడులో టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకుపోతోంది. ఇది కూడా ఒక చరిత్ర కానుంది. ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాలు మూడు రాష్ట్రాల సీఎం అభ్యర్థులు వెనుకంజులో ఉండడం గమనార్హం. ముఖ్యమంత్రులు వెనుకంజ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు […]

Assembly Election Results 2026: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడు పశ్చిమ బెంగాల్లో గంట గంటకు పరిస్థితులు మారిపోతున్నాయి. బెంగాల్లో బిజెపి చరిత్ర సృష్టించే దిశగా సాగుతోంది. తమిళనాడులో టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకుపోతోంది. ఇది కూడా ఒక చరిత్ర కానుంది. ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాలు మూడు రాష్ట్రాల సీఎం అభ్యర్థులు వెనుకంజులో ఉండడం గమనార్హం.

ముఖ్యమంత్రులు వెనుకంజ
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. కీలక రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు తమ సొంత నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో, తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ కొళత్తూరులో, అలాగే కేరళ సీఎం పినరయి విజయన్ ధర్మదం నియోజకవర్గంలో వెనుకంజలో కొనసాగుతున్నారు.

పోరు హోరాహోరీ..
ఈ ఎన్నికల ఫలితాలు పాత రాజకీయ సమీకరణాలను తిరగరాయనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీల అగ్రనేతలు స్వంత నియోజకవర్గాల్లోనే గట్టి పోటీని ఎదుర్కోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని పెంచింది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుండటంతో, తదుపరి రౌండ్లలో ఈ అగ్రనేతలు పుంజుకుంటారా లేదా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఆధిక్యాన్ని స్థిరపరుచుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.

ఎన్నికల ఫలితాలు కేరళ పశ్చిమ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ దాదాపు నిజమవుతున్నాయి. తమిళనాడులో మాత్రం ఎగ్జిట్ పోల్స్ తార్మారయ్యాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper