Homeజాతీయ వార్తలుCrime News: 25 మందితో 25 సార్లు పారిపోయి భార్య.. ఏమీ అనని భర్త.. కారణమిదే

Crime News: 25 మందితో 25 సార్లు పారిపోయి భార్య.. ఏమీ అనని భర్త.. కారణమిదే

Assam Womanఆమెకు పారిపోవడం అలవాటే. వెళ్లిన ప్రతిసారి మళ్లీ తిరిగొస్తుంది. భర్త కూడా ఏమి అనకపోవడంతో ఆమెకు అలవాటైపోయింది. ఏకంగా ఇప్పటికి 25 సార్లు 25 మందితో లేచిపోవడం గమనార్హం. వింటేనే ఏదోలా అనిపిస్తున్న ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. భర్త అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆమె తన సుఖం తానే చూసుకుంటోంది. దొంగతనానికి అలవాటుపడిన గొడ్డులాగా ఆమె ఇలా చేయడంపై భర్త మాత్రం పల్లెత్తు మాట కూడా అనడం లేదు. ఇదే అదనుగా భావించి ఆమె గ్రామంలోని పలువురు యువకులతో పలుమార్లు పారిపోవడం కొద్ది రోజులు ఎంజాయ్ చేసి మళ్లీ ఇంటికి రావడం పరిపాటే.

అస్సాంలోని నగావ్ జిల్లాలోని థింగ్ లహ్కర్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల మఫీజుద్దీన్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతడికి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు. 2011లో వీరి పెళ్లి జరిగింది. ఇప్పటికి అతడి భార్య 25 సార్లు లేచిపోయింది. పారిపోయిన ప్రతిసారి ఏదో ఒక కారణం చెబుతూ తిరిగి ఇంటికి వస్తుంది. వచ్చిన తరువాత ఇకపై అలా చేయనని భర్తతో మాయమాటలు చెప్పి మళ్లీ సంసారం చేస్తానని చెబుతుంది. దీంతో అతడు ఏం చేయలేక పిల్లల కోసం చేరదీయక తప్పడం లేదని వాపోతున్నాడు.

వైవాహిక జీవితంలో తృప్తి లేకనో మరే ఇతర కారణాల వల్లనో ఆమె తన వక్రబుద్దిని మార్చుకోలేకపోతోంది. దీనిపై భర్త కూడా ఆమెను ఏమి అనకపోవడంతో ఆమెకు అదో అలవాటుగా మారిపోయింది. వెళ్లిన ప్రతిసారి చుట్టాల ఇంటికి వెళ్తున్నానని చెప్పడమో లేక పనుందని చెప్పడమో చేస్తూ ఇంటి నుంచి వెళ్లిపోతోంది. మూడు నెలల పిల్లాడిని సైతం వదిలేసి వెళ్లడం గమనార్హం.

ఇటీవల రూ.22 వేల నగదు, ఇంట్లోని వస్తువులు తీసుకుని పారిపోయింది. ఇంత జరిగినా భర్తలో ఆమెపై ప్రేమ మాత్రం తగ్గడం లేదు. ఆమెను ఇంకా ప్రేమిస్తున్నానని చెప్పడం కొసమరుపు. ఒక వేళ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో ఆ దిశగా ఆలోచన కూడా చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె భర్త సహనానికి అందరు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భార్య చిన్న తప్పు చేస్తేనే చిత్రహింసలకు గురి చేసే భర్తలుండగా భార్య అన్ని తప్పులు చేసినా సంయమనం పాటించడం గొప్ప విషయమే.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper