Homeఅంతర్జాతీయంIndia Russia oil imports latest news: అమెరికా గ్రీన్ సిగ్నల్.. భారత్ కు మళ్లీ...

India Russia oil imports latest news: అమెరికా గ్రీన్ సిగ్నల్.. భారత్ కు మళ్లీ రష్యా ఆయిల్!

India Russia oil imports latest news: అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమడి సంక్షోభం నెలకొంది. ఇరాన్ హర్మూజ్ జల సందిని మూసివేయడంతో గల్ఫ్ దేశాల నుంచి వివిధ దేశాలకు సరఫరా అయ్యే తమరు నూకలు హర్మూజ్ వద్ద నిలిచిపోయాయి. ఇదే సమయంలో అమెరికా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి పై ఆంక్షలు విధించింది. దీంతో ఇబ్బందికర పరిస్థితిలో ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం పెరుగుతుండడంతో రష్యా ఆయిల్ దిగుమతికి అమెరికా గతంలో రెండుసార్లు అనుమతి […]

India Russia oil imports latest news: అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమడి సంక్షోభం నెలకొంది. ఇరాన్ హర్మూజ్ జల సందిని మూసివేయడంతో గల్ఫ్ దేశాల నుంచి వివిధ దేశాలకు సరఫరా అయ్యే తమరు నూకలు హర్మూజ్ వద్ద నిలిచిపోయాయి. ఇదే సమయంలో అమెరికా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి పై ఆంక్షలు విధించింది. దీంతో ఇబ్బందికర పరిస్థితిలో ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం పెరుగుతుండడంతో రష్యా ఆయిల్ దిగుమతికి అమెరికా గతంలో రెండుసార్లు అనుమతి ఇచ్చింది. భారత్ దిగుమతి గడువు రెండు రోజుల క్రితం ముగిసింది.

గడు మరో మారు పెంపు..
చమురు స్థిరత్వం కోసం అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యూహాలను మళ్లీ ప్రభావితం చేసే అవకాశం ఉంది. జూన్ 17 వరకు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లకు అనుమతి ఇచ్చింది. ఈ ప్రకటన, భారత్ వంటి దేశాలకు మరింత వ్యూహాత్మక స్వేచ్ఛను అందించేలా కనిపిస్తోంది.

ఆంక్షల మినహాయింపు వెనుక..
గతంలో విధించిన ఆంక్షల నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వడం ద్వారా అమెరికా, ఇంధన సరఫరా గొలుసులో అస్థిరతను తగ్గించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలను కొంతవరకు నియంత్రణలో ఉంచడానికి ఉద్దేశించినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధ పరిస్థితులు, భూ-రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఇలాంటి తాత్కాలిక విధానాలు సాధారణమవుతున్నాయి. అయితే ఈ మినహాయింపు కేవలం ఆర్థిక అవసరాల నుంచి పుట్టినదేనా లేదా రాజకీయ సంకేతాలు కూడా ఉన్నాయా అనేది చర్చనీయాంశం. ఏదేమైనా, ఇది రష్యా ఆయిల్‌పై ఆధారపడిన దేశాలకు ఊపిరి పీల్చుకునే అవకాశం కల్పిస్తోంది.

భారత్‌కు గుడ్ న్యూస్వా..
భారత్ ఇప్పటికే రష్యా నుంచి గణనీయమైన మొత్తంలో క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లు చేస్తోంది. అమెరికా ఈ తాత్కాలిక అనుమతి ఇచ్చిన నేపథ్యంలో దిగుమతులను మరింత పెంచే సాధ్యత ఉంది. ఇది దేశంలోని ఇంధన ఖర్చులను తగ్గించడంతోపాటు, ఆర్థిక స్థిరత్వానికి దోహదపడవచ్చు.అయినప్పటికీ, భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిన్న స్పష్టం చేసినట్లు, ఈ కొనుగోళ్లు అమెరికా ఆంక్షలతో సంబంధం లేకుండా స్వతంత్ర నిర్ణయంగా కొనసాగుతున్నాయి. ఇది భారత్ విదేశి విధానంలో స్వాతంత్ర్యం, బహుముఖ సంబంధాలను ప్రతిబింబిస్తుంది. ఏ దేశం ఒత్తిడికి లొంగకుండా తన శక్తి అవసరాలను తీర్చుకోవడం ఆర్థిక దృఢతకు నిదర్శనం.

ఈ నిర్ణయం తాత్కాలికమైనప్పటికీ, ఇంధన మార్కెట్‌లో రష్యా పాత్రను మళ్లీ బలోపేతం చేసే అవకాశం ఉంది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఇలాంటి సదవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో, ప్రపంచ వాణిజ్య నిబంధనలు, పర్యావరణ లక్ష్యాలు, పునరుత్పాదక ఇంధనాల మార్పిడి వంటి అంశాలను కూడా సమతుల్యం చేసుకోవడం కీలకం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper