Homeఆంధ్రప్రదేశ్‌Bhuma Akhila Priya- Jana Sena: జనసేనలోకి అఖిలప్రియ.. టీడీపీతో సంబంధాలు కట్‌!

Bhuma Akhila Priya- Jana Sena: జనసేనలోకి అఖిలప్రియ.. టీడీపీతో సంబంధాలు కట్‌!

Bhuma Akhila Priya- Jana Sena: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి మరోషాక్‌ తగలనున్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో 40 ఏళ్లుగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న భూమా ఫ్యామిలీ పార్టీ మారనున్నట్టు టాక్‌ వినిపిస్తోంది. రాయలసీమతోపాటు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా భూమా కుటుంబానికి మంచి పేరు, ప్రజాదరణ ఉంది. కర్నూలు జిల్లాలో సొంత కేడర్‌ కూడా బలంగా ఉంది.

Bhuma Akhila Priya- Jana Sena
Bhuma Akhila Priya- pawan kalyan

2014లో టీడీపీలోకి..
భూమా నాగిరెడ్డి, శోభా 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశలో మెగాస్టార్‌ స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ టికెట్‌పై పోటీచేసి విజయం సాధించారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు దగ్గరయ్యారు. వైఎస్సార్‌ కుటుంబంతో బంధుత్వం కూడా కలుపుకున్నారు. అఖిల ప్రియను మొదట వైఎస్సార్‌ బంధువుతో వివాహం జరిపించారు. వైఎసాసర మరణం తర్వాత జగన్‌వెంట నడిచారు. 2014 ఎన్నికల సమయంలో ఇద్దరూ మృతిచెందడం.. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగా.. భూమా కుటుంబం వైఎస్సార్‌ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన వీరు చంద్రబాబు పిలుపు మేరకు తెలుగుదేశంలో చేరారు. తల్లి మరణంతో భూమా అఖిల ప్రియ రాజకీయ అరంగేట్రం చేశారు. స్వల్ప కాలంలోనే పొలిటికల్‌గా ఎదిగి మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం భూమా అఖిల ప్రియకు చంద్రబాబు నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదని తెలుస్తోంది. దీంతో ఆ పార్టీతో తెగదెంపులు చేసుకోవాలని ఆ కుటుంబం యోచిస్తోంది.

వైసీపీ దెబ్బకు..
భూమా కుటుంబం ప్రస్తుతం కోర్టు కేసుల్లో ఇరుక్కుంది. అధికార వైసీపీ పార్టీ దెబ్బకు టీడీపీ పార్టీ రాజకీయంగా పాతాలంలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఎవరినీ పట్టించుకోవడం లేదని సమాచారం. రాబోయే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి తనకు.. నంద్యాల నుంచి సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి టికెట్‌ ఇవ్వాలని అఖిల ప్రియ డిమాండ్‌ చేస్తున్నారు. అయితే.. దీనిపై బాబు క్లారిటీ ఇవ్వడం లేదు.

Bhuma Akhila Priya- Jana Sena
Bhuma Akhila Priya

జనసేనవైపు చూపు..
చంద్రబాబు తీరుతో భూమా అఖిల ప్రియ జనసేన పార్టీవైపు చూస్తున్నారని సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. భూమా ఫ్యామిలీకి మెగా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు భూమానాగిరెడ్డి, శోభానాగిరెడ్డి ఆ పార్టీ టికెట్‌పై పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత చిరు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో భూమా కుటుంబం వైఎస్సార్‌ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చి మంత్రి పదవులు చేపట్టారు. ప్రస్తుతం జనసేనలో చేరితే ఆళ్లగడ్డలో కాపు సామాజికవర్గం ఓట్లు కలిసివస్తాయని భూమా అఖిలప్రియ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే గనుక నిజమైతే ఏపీలో టీడీపీ పార్టీకి బిగ్‌ షాక్‌ తప్పదని చెప్పవచ్చు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular