Abdul Basit Nuclear Warning India Mumbai Delhi: పాముకు పాలు పోసి పెంచినా దాని గుణం మారదు.. కుక్కతోక సక్కగ చేయాలని చూఏసినా వృథా ప్రయత్నమే.. అలాగే.. పాకిస్తాన్‌ను పాలు పోసి పెంచుతున్న అమెరికాకు దానితోనే ప్రమాదమని ఆదేశ ఇంటలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ ఇటీవల నివేదిక ఇచ్చారు. దీనిపై అమెరికా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దానిని డైవర్డ్ చేయాలనుకున్నాడో.. లేక భారత్‌ను ఇందులోకి లాగాలనుకున్నాడో.. తెలియదుగానీ, పాకిస్తాన్ పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ అణు బెదిరింపులకు దిగాడు. అమెరికా తమపై దాడిచేస్తే.. తాము భారత నగరాలపై అణువాయుధాలు ప్రయోగిస్తామని భారత్‌పై తనకు ఉన్న కుట్రను బహిర్గతం చేశాడు.
Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!
బాసిత్ అణు బెదిరింపులు..
బాసిత్ ఇటీవల సీఎన్‌ఎన్–న్యూస్18 నిర్వహించిన చర్చలో పాల్గొన్నాడు. ఇరాన్ తర్వాత పాక్‌పై అమెరికా దాడి చేస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా.. తాము భారత్‌లోని ముంబై, ఢిల్లీని టార్గెట్ చేస్తామని తెలిపారు. పాక్ అణు సామర్థ్యం ప్రతీకార ఆయుధంగా ఉపయోగిస్తామని హెచ్చరించారు. అమెరికా రేంజ్ దూరంగా ఉండటంతో భారత్ మాత్రమే లక్ష్యమని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు పాక్ అణు విధానం, లక్ష్యం ఏమిటో చెప్పకనే చెబుతుంది.
అమెరికా ఆందోళనలు
ఇదిలా ఉంటే అమెరికాకు పాకిస్తాన్‌తోనే ముప్పు ఉందని ఇంటలిజెన్స్ ౖyð రెక్టర్ తులసీ గబ్బార్డ్ ఇటీవల నివేదిక ఇచ్చారు. ఇందులో పాక్ నుంచి భారత్‌కు అణు ముప్పు ఉందని కూడా నిర్ధారించారు. పాక్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధి చేస్తోందని, షాహిన్–3 రేంజ్ 2,750 కి.మీ.కు పరిమితమైనా మరింత దూరాలు కవర్ చేయాలని ప్రయత్నిస్తోందని తెలిపారు. ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఈ బెదిరింపులు ప్రపంచ భద్రతకు సవాలుగా మారాయి.
పాక్ అణు వ్యూహం
పాక్ అణు కార్యక్రమం 1998 పరీక్షలతో ప్రపంచానికి తెలిసింది. ’నో ఫస్ట్ యూజ్’ విధానం లేకపోవడం, భారత్ దాడులకు ప్రతీకారంగా అణు ప్రయోగం చేస్తామని మాజీ అధికారులు ఖలీద్ అహ్మద్ వంటి వారు పదేపదే చెబుతున్నారు. ఇటీవల ఆపరేషన్ సిందూర్‌లో భారత్ పాక్ లక్ష్యాలను ఛేదించడం ఈ బెదిరింపులకు మరింత ఆకర్షణ పెంచింది.
బాసిత్ వ్యాఖ్యలపై భారత్ అలర్ట్ అయింది. ఇదే సమయంలో అమెరికా భయంతో భారత్‌ను భయపెట్టాలని చూస్తోందని, అందాకా వస్తే.. పాకిస్తాన్ ప్రపంచ పటంలోనే ఉండదని హెచ్చరించింది. ఇప్పటికే పలుమార్చు భారత్ చేతిలో చావుదెబ్బలు తిన్న పాకిస్తాన్.. అణు బెదిరింపులు చేయడం కామన్ అయింది. మరోవైపు భారత్ ఇప్పటికే రక్షణ వ్యవస్థలను పటిష్టం చేస్తోంది.
