Hair: మనకు ప్రకృతి ఎన్నో రకాల పండ్లు, ఆకులు ఇచ్చింది. వాటితో అనేక లాభాలున్నాయి. జామ కాయ తినడం వల్ల విటమిన్ సి లభిస్తుంది. పండ్లలో నెంబర్ వన్ పోషకాలు ఉన్న పండుగా జామను చెప్పుకోవచ్చు. పల్లెలు, పట్టణాల్లో ప్రతి ఇంట్లో జామ చెట్టు ఉంటుంది. జామ పండ్లను చూస్తే ఎవరైనా విడిచిపెట్టకుండా తింటారు. వీటిని తినడం వల్ల మనకు ఎన్నో విధాలుగా మేలు కలుగుతుంది. డయాబెటిస్ పేషెంట్లకైతే జామకాయలు దివ్యమైన ఆహారం. రోజు తినడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అందుకే జామ పండ్లకు అంతటి ప్రాధాన్యం ఉంటుంది. జామ పండ్లే కాదు ఆకులు కూడా మనకు ఔషధంలా ఉపయోగపడతాయి.
Also Read: Summer 2023: ఈ వేసవి చాలా హాట్.. జాగ్రత్తగా లేకుంటే ముప్పే!
తెల్ల జుట్టును..
ఇటీవల కాలంలో చాలా మందికి చిన్న వయసులోనే జుట్టుగా తెల్లగా మారుతుంది. ఫలితంగా నలుగురిలో తిరగాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇరవైలోనే అరవై ఏళ్ల ముసలి వాడిలా కనిపిస్తున్నారు. దీంతో ఎవరికి చెప్పుకోలేక నరక యాతన అనుభవిస్తున్నాయి. జామ ఆకులు తెల్ల జుట్టును నల్లగా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయనే సంగతి చాలా మందికి తెలియదు. అందుకే ఏవేవో ఇంగ్లిష్ మందులు వాడుతూ కలర్లు వేసుకుంటూ కవర్ చేసుకుంటున్నారు. కానీ దీని వల్ల ఏం ప్రయోజనం కలర్ వేసుకుంటే మళ్లీ వెంట్రుకలు పెరిగాయంటే తెల్ల జుట్టు బాగోతం బయట పడుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం జామ ఆకుల పేస్ట్.
దీన్ని ఎలా తయారు చేయాలి?
guava
జామ ఆకుల పేస్టును ఎలా తయారు చేయాలి? ఎలా పెట్టుకోవాలి? ఎంత సేపు ఉంచుకోవాలి? అనే విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుని వాడితే తెల్ల జుట్టు కాస్త నల్లగా మారడంతో ఇబ్బందులు తొలగుతాయి. దీనికి గాను మనం చేయవలసిందల్లా జామ ఆకులు సేకరించి వాటిని గోరు వెచ్చని నీటిలో రెండు గంటలు నానబెట్టాలి. తరువాత దాన్ని పేస్టుగా నూరి ముద్దగా చేసుకోవాలి. పిదప జుట్టుకు రాసుకోవాలి. కనీసం రెండు గంటలు ఆరనివ్వాలి. రెండుగంటల తరువాత షాంపూతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఫలితం వస్తుంది.
ఇందులో..
జామ ఆకుల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇదే జుట్టును నల్లగా చేసేందుకు సహకరిస్తుంది. ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును దెబ్బతీసే ఫ్రీరాడికల్స్ కు వ్యతిరేకంగా పోరాడి జుట్టు దెబ్బతికుండా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. జుట్టుకు హాని కలగకుండా కాపాడుతుంది. జుట్టును దుమ్ము, ధూళి వంటి మలినాలు తొలగించడంలో సహకరిస్తుంది. ఇలా జామతో మనకు పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే కచ్చితంగా జామను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయని తెలుసుకోవాలి.
జామ కాయతో..
జామ కాయతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడేందుకు దోహదపడుతుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు నిత్యం జామకాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల కడుపులో మలినాలు లేకుండా చేస్తుంది. మలం నిలువ ఉండకుండా ఎప్పటికప్పుడు మలవిసర్జన సాఫీగా జరిగేందుకు సహకరిస్తుంది. ఇన్ని రకాల లాభాలున్నందునే జామను మన ఆహారంలో చేర్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అసవరం ఎంతైనా ఉంది.
Also Read: Poonam Kaur: నన్ను వెలి వేస్తున్నారంటూ ఏడ్చేసిన హీరోయిన్ పూనమ్ కౌర్… గుండెలు పిండేసే సంఘటన
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Why hair cant return to its original color after turning white or gray
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com